ప్లీజ్ మమ్మల్నితీసుకోండి: హైడ్రాలో పని చేసేందుకు ఊహించని రేంజ్‎లో అప్లికేషన్లు

ప్లీజ్ మమ్మల్నితీసుకోండి: హైడ్రాలో పని చేసేందుకు ఊహించని రేంజ్‎లో అప్లికేషన్లు

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా తెలంగాణలో టాక్ ఆఫ్ ది టౌన్‎గా మారింది హైడ్రా. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు, కుంటల పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రా.. గవర్నమెంట్ సైడ్ నుండి ఫ్రీ హ్యాండ్ ఉండటంతో దూసుకుపోతోంది. హైడ్రాకు ప్రభుత్వం ఇటీవల చట్టబద్ధత కూడా కల్పించిన విషయం తెలిసిందే. చట్టబద్ధత లభించడంతో ఇకపై హైడ్రా మరింత పవర్ ఫుల్‎గా మారింది. ఈ క్రమంలోనే అక్రమ కట్టడాల కూల్చివేతల కోసం తమ బలాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని హైడ్రా భావిస్తోంది. 

ప్రస్తుతం హైడ్రాకు 167 మంది రెగ్యులర్, 947 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం కేటాయించింది. హైడ్రాను మరింత పటిష్టం చేసేందుకు మరో 3 వేల మంది సిబ్బందిని కేటాయించాలని ప్రభుత్వానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో, హైడ్రాలో పని చేసేందుకు ఉద్యోగుల నుండి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. హైడ్రాలో భాగస్వామ్యం అయ్యేందుకు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.  హైడ్రాలో వర్క్ చేస్తామని ఉద్యోగుల నుండి భారీగా అప్లికేషన్లు వస్తున్నాయి. 

పోలీస్, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ విభాగాల ఉద్యోగుల ఎక్కువగా హైడ్రాతో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.  అయితే, హైడ్రాలో రిక్రూట్మెంట్ విషయంలో అధికారులు ఆచితూచీ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. హైడ్రాలో పని చేస్తామని దరఖాస్తు చేసుకున్న ఉద్యోగాల బ్యాగ్రౌండ్‎ను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు సమాచారం. అయితే, గతంలో ఎలాంటి రిమార్క్ లేకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న ఉద్యోగులనే తీసుకోవాలని హైడ్రా నిర్ణయం తీసుకున్నట్లు టాక్.