శిరీష మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్.. హత్య చేసిందే భర్త సోదరే

శిరీష మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్.. హత్య చేసిందే భర్త సోదరే

హైదరాబాద్‏ చాదర్‎ఘాట్ పీఎస్ పరిధిలో శిరీష అనే మహిళ అనుమానాస్పద మృతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. శిరీషను ఆమె భర్త వినయ్ కుమార్, అతని సోదరి, మరో వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. బుధవారం (మార్చి 5) నిందితులు సరితా (ఏ1), వినయ్ కుమార్ (ఏ2), నిహల్ కుమార్‎ (ఏ3)ను మీడియా ముందు ప్రవేశ పెట్టగా.. కేసుకు సంబంధించిన వివరాలను మలక్ పేట్ ఏసీపీ శ్యాం సుందర్ మీడియాకు వెల్లడించారు. 

గతంలో మృతురాలు శిరీష, నిందితురాలు వినయ్ సోదరి సరితా ఒకే హాస్పిటల్‎లో పని చేసేవారు. ఈ క్రమంలో ఉద్యోగం రిజైన్ విషయంలో సరిత, శిరీషకు మధ్య గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన సరిత శిరీషపై దాడి చేసింది. అసభ్యపదజలంతో దూషిస్తూ మెడపై దాడి చేయడంతో శిరీష అపస్మారక స్థితిలోకి వెళ్లింది. సృహా కోల్పోయిన శిరీషను దిండుతో ఊపిరాడకుండా చేసి సరితా హత్య చేసింది. 

శిరీష భర్త వినయ్ తన అక్క సరితాను కాపాడే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా వినయ్, నిహాల్ కుమార్ ఘటన స్థలంలో సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు తమదైన శైలీలో విచారణ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. శిరీష హత్యకు ఉపాయోగించిన దిండు,  బెడ్ షీట్, ఐరన్ రాడ్లను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.