
కీసర, వెలుగు: మహిళ మెడలోని పుస్తెలతాడును గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశాడు. కీసర ఇన్స్పెక్టర్శ్రీనివాస్కథనం ప్రకారం.. కీసరకు చెందిన చింతల పద్మ శనివారం రాత్రి తన భర్తతో కలిసి బైక్పై యాదగిరిపల్లి వెళ్తోంది. ఆ గ్రామ శివారులో బైక్పై వచ్చిన దుండగుడు పద్మ మెడలోని 4 తులాల పుస్తెలతాడు లాక్కెళ్లాడు. ఈ క్రమంలో అది తెగిపోయి, గుండ్లు కిందపడ్డాయి. దంపతులు వాటిని వెతుకుతుండగా.. అటుగా బైక్పై వచ్చిన ఓ వ్యక్తి వారిని చూసి, ఏమైందని అడిగాడు.
ఆ దంపతులు పుస్తెలతాడు లాక్కెళ్లిన వ్యక్తి, నువ్వు ఒకేలా ఉన్నారంటూ నిలదీశారు. దీంతో, అతను కీసర వైపు వెళ్లిపోయాడు. బాధితులు ఆ వ్యక్తి వెంటే వెళ్తూ దొంగ దొంగ అని అరవడంతో రోడ్డుపై ఉన్నవారు అతన్ని పట్టుకొని, దాడి చేశారు. అనంతరం దంపతులు స్థానికుల సహాయంతో ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి, ఫిర్యాదు చేశారు. అయితే, వారు దొంగగా భావించిన వ్యక్తి దొంగ కాదని ఇన్స్పెక్టర్తెలిపారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.