రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో గుర్తు తెలియని మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్ మీరాలమ్ చెరువులో డెడ్‌బాడీ ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. సమాచారాన్ని పోలీసులకు అందించారు.
రంగంలోకి దిగిన అత్తాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డెడ్‌బాడీని బయటకి తీయించి పోస్ట్ మార్టం ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరైనా చంపి పడేసి ఉంటారా.. సూసైడ్ఆ అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే ఇటీవల నగరంలో గుర్తు తెలియని మృతదేహాలు తరచూ లభ్యం అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.