అభిమానం వెర్రితలలు వేస్తే ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని స్థితిలోకి వెళ్తుంటారు కొంతమంది. శుక్రవారం అర్థరాత్రి హైదరాబాద్ లో ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది.అర్ధరాత్రి హై టెన్షన్ లైన్ పోల్ ఎక్కి టెన్షన్ క్రియేట్ చేశాడు ఓ యువకుడు. కూకట్ పల్లి పాపారాయుడు నగర్ కలనీలో దారువాల వైన్ షాప్ దగ్గర ఉన్న హై టెన్షన్ పోల్ ఎక్కి యువకుడు హల్చల్ చేశాడు.
పవన్ కళ్యాణ్ వస్తే కానీ నేను దిగను అంటూ గట్టిగా అరుస్తూ కేకలు వేసాడు సాయి.ఈ విషయం తెలిసికున్నా సాయి తల్లి మరియు భార్య సంఘటన స్థలానికి చేరుకొని కిందికి దిగి రావాలంటూ ఆర్తనాదాలు చేస్తూ వేడుకున్నా కూడా దిగలేదు.తన భార్య ఎనిమిది నెల గర్భవతి అన్న ఆలోచన లేకుండా పవన్ కళ్యాణ్ వస్తే నేను దిగుతాను అంటూ గట్టిగా అరుస్తూ బీభత్సం సృష్టించాడు.
స్థానికుల ఫిర్యాదుతో విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది సాయంతో మూడు గంటలు పాటు శ్రమించి చాకచక్యంగా వ్యవహరించి సదరు యువకుడిని సురక్షితంగా కిందకి దించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు.