అనాబెల్‌‌ ఫాస్టెస్ట్‌‌ డబుల్‌‌ సెంచరీ

అనాబెల్‌‌ ఫాస్టెస్ట్‌‌ డబుల్‌‌ సెంచరీ

పెర్త్‌‌: ఆస్ట్రేలియా బ్యాటర్‌‌ అనాబెల్‌‌ సదర్లాండ్‌‌.. విమెన్స్‌‌ టెస్ట్‌‌ క్రికెట్‌‌ చరిత్రలో సరికొత్త రికార్డును సృష్టించింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్ట్‌‌లో ఫాస్టెస్ట్‌‌ డబుల్‌‌ సెంచరీ (248 బాల్స్‌‌) నమోదు చేసింది. తద్వారా 2001లో ఇంగ్లండ్‌‌పై కారెన్‌‌ రోల్టన్‌‌ (306 బాల్స్‌‌) నెలకొల్పిన రికార్డును బద్దలుకొట్టింది.

సదర్లాండ్‌‌ (210) సూపర్‌‌ బ్యాటింగ్‌‌తో 251/5 ఓవర్‌‌నైట్‌‌ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆట కొనసాగించిన ఆసీస్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌ను 125.2 ఓవర్లలో 575/9 స్కోరు వద్ద డిక్లేర్‌‌ చేసింది. గార్డెనర్‌‌ (65), కిమ్‌‌ గారెత్‌‌ (49) రాణించారు. చోలే ట్రయాన్‌‌, క్లాస్‌‌ చెరో మూడు వికెట్లు తీశారు. తర్వాత సౌతాఫ్రికా ఆట ముగిసే టైమ్‌‌కు రెండో ఇన్నింగ్స్‌‌లో 28 ఓవర్లలో 67/3 స్కోరు చేసింది. బ్రిట్స్‌‌ (18 బ్యాటింగ్‌‌), టకెర్‌‌ (27 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు. సఫారీలు ఇంకా 432 రన్స్‌‌ వెనకబడి ఉన్నారు.