ట్యాంక్ బండ్‌‌‌‌‌‌‌‌పై అనభేరి విగ్రహం ఏర్పాటు చేయాలి

కరీంనగర్ సిటీ, వెలుగు: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అనభేరి ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు విగ్రహం హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని ఎల్లాపి సంఘ సభ్యులు  డిమాండ్ చేశారు. అనభేరి వర్ధంతి సందర్భంగా గురువారం ఎల్లాపి సంఘం ఆధ్వర్యంలో సిటీలోని అనభేరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అనభేరి కూతురు విప్లవకుమారి, ఎల్లాపిసంఘం అర్బన్ యూనిట్ అధ్యక్షుడు మురహరిరావు, ప్రధాన కార్యదర్శి సురేందర్ రావు, యుగంధర్ రావు, పృథ్వీధర్ రావు, వసంత రావు తదితరులు పాల్గొన్నారు.