స్క్వాష్ వరల్డ్ చాంపియన్‌‌‌‌షిప్ సెమీఫైనల్లో అనహత్‌‌‌‌, వీర్‌‌‌‌‌‌‌‌

 స్క్వాష్ వరల్డ్ చాంపియన్‌‌‌‌షిప్ సెమీఫైనల్లో అనహత్‌‌‌‌, వీర్‌‌‌‌‌‌‌‌

కౌలాలంపూర్: ఇండియా స్క్వాష్ ప్లేయర్లు అనహత్ సింగ్, వీర్ చోత్రానీ వరల్డ్ చాంపియన్‌‌‌‌షిప్ క్వాలిఫయింగ్ ఈవెంట్ (ఆసియా)లో  సెమీఫైనల్స్‌‌‌‌ చేరుకున్నారు.  శుక్రవారం జరిగిన విమెన్స్ సింగిల్స్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో   ఐదో సీడ్‌‌‌‌గా బరిలోకి దిగిన 17 ఏండ్ల అనహత్ సింగ్11-–1, 11-–7, 11–-5 తేడాతో   జపాన్‌‌‌‌కు చెందిన అకారి మిడోరికావాను చిత్తుగా ఓడించింది.  

శనివారం జరిగే సెమీ ఫైనల్లో హాంకాంగ్‌‌‌‌ ప్లేయర్ హెలెన్ టాంగ్‌‌‌‌తో తలపడనుంది. మరో క్వార్టర్స్‌‌‌‌ పోరులో  టాంగ్ 11-–5, 11–-6, 10–-12, 11–-9తో  ఇండియా ప్లేయర్ తన్వి ఖన్నాపై గెలిచింది. మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో రెండో సీడ్ వీర్ చోత్రానీ  9–-11, 11–-6, 11-–6, 11–-7 తేడాతో  ఆరో సీడ్ మొహమ్మద్ షఫిక్ (మలేసియా)పై నెగ్గాడు.