విశ్లేషణ: ప్రతి గింజనూ రాష్ట్ర సర్కారే కొనాలె

అమ్మబోతే అడ‌‌‌‌వి.. కొన‌‌‌‌బోతే కొరివి అన్నట్లుగా తయారయ్యింది రాష్ట్ర రైతుల ప‌‌‌‌రిస్థితి. రైతుల కోసం తెచ్చిన ప‌‌‌‌థ‌‌‌‌కాలన్నీ కాగితాల‌‌‌‌కే ప‌‌‌‌రిమిత‌‌‌‌మ‌‌‌‌వుతున్నాయి. ప్రకృతి వైప‌‌‌‌రీత్యాలు, ప్రతికూల వాతావ‌‌‌‌ర‌‌‌‌ణ ప‌‌‌‌రిస్థితులు, ద‌‌‌‌ళారుల ద‌‌‌‌గా, ప్రభుత్వాల ఉదాసీన‌‌‌‌త రైతుల‌‌‌‌కు శాపంగా మారుతోంది. పంట వేసింది మొద‌‌‌‌లు.. చేతికందే వ‌‌‌‌ర‌‌‌‌కు కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులు రైతుల‌‌‌‌ను నిండా ముంచుతున్నాయి. దీంతో రైతులు అప్పుల ఊబి నుంచి బ‌‌‌‌య‌‌‌‌ట‌‌‌‌ప‌‌‌‌డటంలేదు. రైతుని రాజు చేసే వ‌‌‌‌ర‌‌‌‌కు నిద్రపోనని గ‌‌‌‌తంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్​ ఇచ్చిన మాట‌‌‌‌కు పాబంది లేదా? స్వార్థ ప్రయోజ‌‌‌‌నాల కోసం రైతుల‌‌‌‌ బ‌‌‌‌తుకుల‌‌‌‌ను రాజ‌‌‌‌కీయం చేయడం స‌‌‌‌మంజ‌‌‌‌సమా? కేంద్రం వడ్లు కొనకపోతే ప్రతి గింజను కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంది. రైతును రాజును చేస్తామ‌‌‌‌ని గొప్పలు చెప్పుకోవడం కాదు.. ఒక ప్రణాళికాబ‌‌‌‌ద్ధమైన వ్యవసాయ విధానాన్ని రాష్ట్ర సర్కారు అవ‌‌‌‌లంబించాల్సిన అవసరం ఉంది.

తెలంగాణ పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. 60 లక్షల మందికి పైగా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. విభిన్న నేలలు, సమశీతోష్ణ వాతావరణం, మంచి వర్షపాతం, వృత్తి నైపుణ్యం కలిగిన రైతులు మనకు ఉన్నారు. రాష్ట్రంలో షరతుల సాగు విధానం అవ‌‌‌‌లంబించాల‌‌‌‌ని గ‌‌‌‌త ఏడాది మేలో సీఎం కేసీఆర్ ప్రక‌‌‌‌టించారు. ప్రభుత్వ సూచ‌‌‌‌న‌‌‌‌ల మేర‌‌‌‌కే రైతులు పంట‌‌‌‌లు వేసుకోవాల‌‌‌‌ని లేదంటే.. రైతుబంధు ఆపేస్తామ‌‌‌‌న్నారు. ఆ త‌‌‌‌ర్వాత యూట‌‌‌‌ర్న్ తీసుకున్న కేసీఆర్‌‌‌‌.. కేంద్ర వ్యవ‌‌‌‌సాయ విధానాల‌‌‌‌ను స‌‌‌‌మ‌‌‌‌ర్థిస్తూ రైతులు ఏ పంటైనా వేసుకోవ‌‌‌‌చ్చని, ఎక్కడైనా పంట అమ్ముకోవ‌‌‌‌చ్చని చెప్పారు.  మళ్లీ ఇప్పుడు రాష్ట్రంలో నియంత్రిత సాగు విధానాన్ని అమ‌‌‌‌లు చేయాలంటూ అధికారుల‌‌‌‌ను ఆదేశించారు. ఒక స్పష్టమైన‌‌‌‌ విధానం లేకుండా హ‌‌‌‌డావుడిగా తీసుకునే నిర్ణయాలు రైతులను తీవ్రంగా నష్టప‌‌‌‌రిచే ప్రమాదం ఉంది. రైతుల‌‌‌‌ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే పక్కా వ్యవ‌‌‌‌సాయ 
విధానాన్ని అనుస‌‌‌‌రించాలి.

వాణిజ్య పంటలను ప్రోత్సహించిన రాష్ట్ర సర్కారు: పూర్వం వరి, పెసర, కంది, సజ్జలు, నువ్వులు, ఉలవలు, రాగులు, మినుములు, పజ్జొన్నలు, ఎర్ర జొన్నలు, తెల్ల జొన్నలు, మక్కజొన్న, బుడ్డ శనగలు, అలసంద, గోధుమ తదితర పంటలు సాగు చేసేవారు. సంప్రదాయ వ్యవసాయం వల్ల పల్లెల్లో స్వయం పోషక విధానం ఉండేది. కానీ, కార్పొరేట్, మార్కెట్ ప్రభావం పెరిగిన తర్వాత ఎక్కువ శాతం రైతులు వాణిజ్య పంటలైన పత్తి, మిర్చితోపాటు పండ్ల తోటలను పెంచడానికి మొగ్గు చూపుతున్నారు. ఎక్కువ లాభాల‌‌‌‌ను ఆర్జించాలంటే సంప్రదాయ పంట‌‌‌‌ల‌‌‌‌ను ప‌‌‌‌క్కన‌‌‌‌పెట్టి పత్తి, మిర్చి, వరి లాంటి వాణిజ్య పంట‌‌‌‌ల‌‌‌‌ను వేయాల‌‌‌‌ని ప్రభుత్వమూ ప్రోత్సహిస్తోంది. కానీ ఇప్పుడు చిరుధాన్యాలు, పప్పు దినుసులు పెద్ద ఎత్తున‌‌‌‌ దిగుమతి చేసుకునే ప‌‌‌‌రిస్థితి ఏర్పడింది. ఇలాంటి పంట‌‌‌‌లను ప్రోత్సహించ‌‌‌‌డం వ‌‌‌‌ల్ల ఇత‌‌‌‌ర రాష్ట్రాల నుంచి దిగుమ‌‌‌‌తి చేసుకునే ప‌‌‌‌రిస్థితి ఉండ‌‌‌‌దు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న వాతావరణ మార్పులు ఈ పంటల సాగుకు అనుకూలించడం లేదు. ఇలాంటి వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా విత్తనాలను అందుబాటులోకి తేవాలి. రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా మారుస్తామ‌‌‌‌ని చెప్పిన సీఎం, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. సంప్రదాయ వ్యవసాయం లాభసాటి కాదని, కాలానికి అనుగుణంగా వ్యవసాయ విధానం మారాల‌‌‌‌ని చెబుతున్న ప్రభుత్వం అందుకు అనువైన విధానాల‌‌‌‌ను రూపొందించ‌‌‌‌డం లేదు.

ఏ పంట వేయాలో సీఎంవో చెప్పడం సరికాదు: రైతులు ఒకే పంటను పదే పదే వేయడం లేదా ఎక్కువ మంది ఒకే పంటను వేయడం ద్వారా భూసారానికి సంబంధించిన సమస్యలు, మార్కెట్లో రేట్ల హెచ్చుతగ్గుల సమస్యలు వస్తుంటాయి. దానికి పరిష్కారంగా ప్రణాళికాబద్ధంగా పంటలు వేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం వివిధ అంశాలపై అధ్యయనం చేసి త‌‌‌‌గిన‌‌‌‌ ప్రణాళిక సిద్ధం చేయాలి. కానీ రాష్ట్రంలో ఇప్పటి వ‌‌‌‌ర‌‌‌‌కు ఎటువంటి అధ్యయనం జ‌‌‌‌రిగిందా? అస‌‌‌‌లు షరతుల సాగుపై రైతులు, రైతు సంఘాల నేత‌‌‌‌లు, వ్యవ‌‌‌‌సాయ నిపుణులు, శాస్త్రవేత్తల‌‌‌‌తో చ‌‌‌‌ర్చించారా? అన్నది ప్రశ్నార్థక‌‌‌‌మే. జిల్లాలు, మండలాల వారీగా రైతులు, నిపుణులూ కలసి సాగు ప్రణాళికను తయారు చేసుకోవాలని, ఇందులో రైతులకు విస్తృత భాగస్వామ్యం ఉండాలని, నిర్బంధం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. వారి మాట వినకుండా సీఎంవో ఏం పంటలు వేయాలో చెప్పడం సరికాదు. మక్కలు వేయొద్దని, వ‌‌‌‌రి సాగు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతుల‌‌‌‌ను శాసిస్తోంది. ఎక్కడ‌‌‌‌ ఏ పంట వేయాలో సూచించడం మంచి నిర్ణయ‌‌‌‌మే. కానీ అంత‌‌‌‌కు ముందు రైతుకు పూర్తి భ‌‌‌‌రోసా క‌‌‌‌ల్పించాల్సిన అవ‌‌‌‌స‌‌‌‌రం కూడా ఉంది. క‌‌‌‌నీస మ‌‌‌‌ద్దతు ధ‌‌‌‌రను ముందే నిర్ణయిస్తే రైతులు చెప్పిన పంట‌‌‌‌లు వేయ‌‌‌‌డానికి సిద్ధప‌‌‌‌డ‌‌‌‌తారు.

పెరిగిన రసాయనాలు, పురుగు మందుల వాడకం: వాణిజ్య పంట‌‌‌‌లు వేయాలంటే రైతుకు ఎక్కువ ఖ‌‌‌‌ర్చుతో కూడుకున్న ప‌‌‌‌ని. పైగా ర‌‌‌‌సాయ‌‌‌‌నాలు, పురుగు మందుల వినియోగం పర్యావరణానికీ సమస్యే. 2014 –15లో పురుగు మందుల వినియోగం ఏడాదికి 2,806 మెట్రిక్ టన్నులు కాగా 2019–20లో 4,915 మెట్రిక్ టన్నులకు పెరిగింది. రసాయన ఎరువుల వినియోగం ఎకరానికి దేశ సగటు 53.9 కిలోలు కాగా రాష్ట్ర సగటు 177 కిలోలు. ఎరువుల అధిక వాడకం వాతావరణాన్ని, భూగర్భ జలాలను కలుషితం చేస్తోంది. రైతులకు వ్యవసాయ ఖర్చులు పెరిగి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. గ‌‌‌‌తంలో ప‌‌‌‌త్తి వేసిన రైతులు పెట్టుబ‌‌‌‌డి కూడా రాక ఆత్మహ‌‌‌‌త్యలు చేసుకున్నారు. ఇలాంటి వారిని ప్రభుత్వ ప‌‌‌‌థ‌‌‌‌కాలు ఆదుకోవ‌‌‌‌డం లేదు. ముఖ్యంగా క‌‌‌‌నీస మ‌‌‌‌ద్దతు ధ‌‌‌‌ర విష‌‌‌‌యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన హామీ ఇవ్వలేక‌‌‌‌పోతున్నాయి. రైతుల‌‌‌‌పై నిజంగా ప్రేమ ఉంటే కేంద్రం ఇచ్చే మ‌‌‌‌ద్దతు ధ‌‌‌‌ర‌‌‌‌కు అద‌‌‌‌నంగా మ‌‌‌‌రో రూ.300 నుంచి రూ.500 వరకు ఇచ్చుకునే అవ‌‌‌‌కాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆ దిశ‌‌‌‌గా క‌‌‌‌నీస మ‌‌‌‌ద్దతు ధ‌‌‌‌ర‌‌‌‌ను పెంచి ఇవ్వాలి.

ఇంకా సంప్రదాయ పద్ధతుల్లోనే.. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో అధిక పంట దిగుబ‌‌‌‌డికి ఆధునిక ప‌‌‌‌ద్ధతుల‌‌‌‌ను అవ‌‌‌‌లంబించ‌‌‌‌డం లేదు. ఆధునిక ప‌‌‌‌ద్ధతిలో వ్యవ‌‌‌‌సాయం చేసేందుకు యాంత్రీకరణ పథకం ప్రకటించినా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం దాని అమలు దిశగా అడుగులు వేయలేదు. 2018–19కి గాను పంటల బీమా ప్రీమియంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇంకా చెల్లించలేదు. పైగా 2020 వానాకాలం సీజన్ నుంచి పంటల బీమా అమలును నిలిపేసింది. 2021 వానాకాలం సీజన్​కు గడువు ముగిసినా నోటిఫికేషన్ విడుదల కాలేదు. సబ్సిడీపై రైతులకు విత్తనాలు అందించే పథకం నీరుగారిపోయింది. రైతులకు పెట్టుబడి సమకూర్చడానికి వారి బ్యాంకు అకౌంట్లలో సొమ్ము జమ చేస్తున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. దీని వల్ల పేద, సన్నకారు రైతులకు ఒనగూరుతున్న ప్రయోజనం ఎంత?  అనేక స్కీమ్‌‌‌‌ల కింద ఇవ్వాల్సిన నిధులు 2018 నుంచి నిలిచిపోయాయంటే రైతుల ప‌‌‌‌ట్ల ప్రభుత్వాల‌‌‌‌కు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమ‌‌‌‌వుతోంది. 

అప్పుల ఊబిలో తెలంగాణ రైతు
దేశంలో రైతు కుటుంబాల సగటు అప్పులు ఐదేండ్లలో 57% పెరిగాయి. 77వ రౌండ్‌‌‌‌ సర్వే ప్రకారం 2018 నాటికి తెలంగాణలో 91.7 శాతం రైతు కుటుంబాలు రుణ ఊబిలో చిక్కుకుపోయాయి. ఒక కుటుంబానికి సగటు రుణం రూ.1,52,113గా ఉంది. జాతీయ సగటు అప్పు రూ.74,121తో పోలిస్తే తెలంగాణలోని రైతు కుటుంబంపై 105 % అధిక అప్పు ఉంది. వ్యవసాయ అప్పుల విషయంలో తెలంగాణ దేశంలో 5వ స్థానంలో నిలిచింది. తెలంగాణలో వ్యవసాయానికి రుణం ఇచ్చేవారి నుంచి 9.1% మంది అప్పు తీసుకోగా, సాధారణ వడ్డీ వ్యాపారుల నుంచి 41.3% మంది రుణాలు అందుకుంటున్నారు. చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు, సహకార సంఘాల నుంచి రైతులు తీసుకుంటున్న అప్పు ఎక్కువ. వడ్డీ వ్యాపారస్తుల నుంచి తీసుకునే అప్పు తక్కువ. కానీ మన రాష్ట్రంలో పరిస్థితి రివర్స్​లో ఉంది. వాణిజ్య బ్యాంకుల నుంచి 24.8% రైతు కుటుంబాలకే రుణాలు అందుతున్నాయి. రాష్ట్రంలో 63% రుణాలు వ్యవ‌‌‌‌సాయం కోసం వినియోగిస్తున్నట్టు కేంద్రం విడుద‌‌‌‌ల చేసిన నివేదిక‌‌‌‌లో పేర్కొంది.

బేషరతుగా వడ్లు కొనాలి: ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు వ‌‌‌‌రి ఉరి కాకుండా ఉండాలంటే బేష‌‌‌‌ర‌‌‌‌తుగా వ‌‌‌‌డ్లను కొనుగోలు చేయాలి. రైతు ప‌‌‌‌ట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధిని చాటుకోవాలి. రాజ‌‌‌‌కీయ‌‌‌‌ వివాదాల కార‌‌‌‌ణంగా వ్యవసాయ రంగాన్ని మ‌‌‌‌రింత‌‌‌‌ సంక్షోభంలోకి నెట్టకుండా  చూడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. కేంద్రం వ‌‌‌‌రి కొన‌‌‌‌క‌‌‌‌పోతే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ధ‌‌‌‌ర్నా చౌక్ కాదు.. జంత‌‌‌‌ర్ మంత‌‌‌‌ర్ ద‌‌‌‌గ్గర కేసీఆర్ ధ‌‌‌‌ర్నా చేయాలి. కేసీఆర్  పోరాడితే సంపూర్ణ మ‌‌‌‌ద్దతు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. వ్యవ‌‌‌‌సాయాన్ని పండ‌‌‌‌గ చేస్తాన‌‌‌‌ని ప్రక‌‌‌‌ట‌‌‌‌న‌‌‌‌లు గుప్పించ‌‌‌‌డం కాదు.. కేంద్రం వ‌‌‌‌డ్లు కొన‌‌‌‌కుంటే ప్రతి గింజ‌‌‌‌ను కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.

కల్లాల నుంచే రైతులకు కష్టాలు: పంట క‌‌‌‌ల్లాల్లోకి రాగానే రైతుకు క‌‌‌‌ష్టాలు మొద‌‌‌‌ల‌‌‌‌వుతున్నాయి. పంట‌‌‌‌ను మార్కెట్ ధ‌‌‌‌రకు అమ్మడం వ‌‌‌‌ల్ల రైతులు న‌‌‌‌ష్టపోవాల్సి వ‌‌‌‌స్తోంది. గ‌‌‌‌తంలో సన్నరకం వరి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కానీ దొడ్డు ర‌‌‌‌కంతో పోలిస్తే స‌‌‌‌న్నర‌‌‌‌కం వ‌‌‌‌రి దిగుబడి స‌‌‌‌గానికి త‌‌‌‌గ్గిపోతుంది. పైగా సన్నరకం పంటకు తెగుళ్లు ఎక్కువ. పెట్టుబ‌‌‌‌డి కూడా ఎక్కువే. పంట పండిన తర్వాత క‌‌‌‌నీస మ‌‌‌‌ద్దతు ధ‌‌‌‌ర ల‌‌‌‌భించ‌‌‌‌క‌‌‌‌పోతే ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందో రైతుల‌‌‌‌కు అనుభ‌‌‌‌వంలోకి వ‌‌‌‌చ్చింది. షరతుల సాగుతో ప్రయోజనాలు ఉన్నా హడావుడిగా అమలు చేయడం వల్ల రైతులు న‌‌‌‌ష్టపోయే ప్రమాదం ఉంది. భూసార పరీక్షలు చేసి, ఎక్కడ ఏ పంట వేస్తే లాభదాయకంగా ఉంటుందో అధ్యయనం చేసి, రైతులకు అవగాహన కల్పించాలి. కనీస మద్దతు ధరపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ప్రతి గింజ‌‌‌‌నూ కొనుగోలు చేయాలి. కౌలు రైతులను కూడా దృష్టిలో పెట్టుకొని విధానాలకు రూపకల్పన చేయాలి.