న్యూఢిల్లీ: యూపీఐ, క్రెడిట్ కార్డుల వాడకం పెరుగుతుండడాన్ని చూస్తుంటే కరోనా సంక్షోభం నుంచి ఎకానమీ వేగంగా రికవరీ అవుతున్నట్టు కనిపిస్తోందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఆర్‌బీఐ డేటా ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్‌లో యూపీఐ ద్వారా రూ. 9.83 లక్షల కోట్ల విలువైన ట్రాన్సాక్షన్లు జరిగాయి. ఈ నెంబర్ ఆగస్టు నాటికి రూ. 10.73 లక్షల కోట్లకు పెరిగింది. పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) ద్వారా క్రెడిట్ కార్టు ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్లు కూడా పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ. 29,988 కోట్లుగా ఉన్న ఇటువంటి ట్రాన్సాక్షన్ల విలువ ఆగస్టు నాటికి రూ. 32,383 కోట్లకు ఎగిసింది. ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో క్రెడిట్‌కార్డుల జరిగిన ట్రాన్సాక్షన్లు కూడా ఇదే టైమ్‌లో రూ. 51,375 కోట్ల నుంచి రూ. 55,264 కోట్లకు పెరిగాయి.
క్రెడిట్ కార్డుల అవుట్‌స్టాండింగ్ (బకాయిలు) 2016–17 నుంచి 2021–22 మధ్య ఏడాదికి 16 శాతం వృద్ధి రేటుతో పెరిగాయని ఎస్‌బీఐ కార్డ్ సీఈఓ రామ మోహన్ రావు అమరా అన్నారు. క్రెడిట్‌కార్డుల వాడకానికి ప్రజలు అలవాటు పడడం పెరుగుతోందని, ఫలితంగా వీటి ద్వారా చేసే ఖర్చులు కూడా పెరుగుతున్నాయని వివరించారు. క్రెడిట్ కార్డుల ద్వారా నెలకు సగటున రూ. లక్ష కోట్లను వినియోగదారులు ఖర్చు చేస్తున్నారని అన్నారు