
- ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, వెలుగు : ల్యాబొరేటరీ టెక్నాలజీ, విశ్లేషణ, బయోటెక్నాలజీ రంగాల్లోని తాజా పరిణామాలను ప్రదర్శించే అనలిటికా అనకాన్ ఇండియా, ఇండియా ల్యాబ్ ఎక్స్‌పో ‘ఫార్మా ప్రో అండ్ప్యాక్ ఎక్స్‌పో 2024’ను హైదరాబాద్హైటెక్స్లో తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఇక్కడ 500లకుపైగా ఎగ్జిబిటర్లు ఏడు వేలకుపైగా ఉత్పత్తులు, 120కిపైగా కొత్త ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.
ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ భారతదేశ ఫార్మా పరిశ్రమ మరింత ఎదుగుతుందని అన్నారు. ప్రపంచ ఫార్మా ఉత్పత్తికి ప్రస్తుతం ఉన్న 35 శాతం సహకారం నుంచి రాబోయే సంవత్సరాల్లో 50 శాతానికి చేరుకోవాలని అన్నారు. ఫార్మాస్యూటికల్ లైఫ్ సైన్సెస్ వాల్యూ చైన్‌లోని ప్రతి సంస్థ ఎదగడానికి సాయం చేస్తామని హామీ ఇచ్చారు.