
డీలిమిటేషన్ పై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్దం సాగుతోంది. డీలిమిటేషన్ సమావేశంలో పాల్గొనేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ చెన్నైకి రానుండగా.. ఎలా వస్తారో చూస్తామని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వార్నింగ్ ఇచ్చారు. శివకుమార్ చెన్నైలో అడుగుపెడితే ఎక్కడికక్కడ అడ్డుకుంటాం.. ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ రాష్ట్ర హక్కుల కంటే రాజకీయప్రయోజనాలకోసమే ప్రాధాన్యత ఇస్తున్నారు.. శివకుమార్ ను చెన్నైకి ఎందుకు ఆహ్వానించారని ప్రశ్నించారు. మేకదాతు ఆనకట్ట ప్రాజెక్టును తమిళనాడు అంతా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది..అయినా పొటో అప్ కోసం శివకుమార్ ను స్టాలిన్ చెన్నైకి రప్పిస్తున్నారని విమర్శించారు.
ALSO READ | కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు
మేం బజ్జీలు , బోండాలు తినేందుకు రాజకీయాలు చేయడం లేదు.. శివకుమార్ చెన్నైకి వస్తే విమానాశ్రయంలోనే అడ్డుకుంటాం.. అడుగడుగునా నిరసన తెలుపుతామన్నారు అన్నామలై.
మార్చి 22న చెన్నైలో జరిగే సమావేశంలో పాల్గొనేందుకు తమిళనాడు సీఎం స్టాలిన్.. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ను ఆహ్వానించడంతో వివాదం తలెత్తింది. ప్రతిపాదిత లోక్ సభ పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై చర్చించనున్నారు.
2026లో డీలిమిటేషన్ ప్రక్రియను అమల్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. జనాభా ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాలను పునర్విభజన చేయాలని యోచిస్తోంది. ఇదే గనక జరిగితే.. జనన రేటు సక్సెస్ ఫుల్ గా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలు ఎంపీ సీట్లను కోల్పోయే అవకాశం ఉంది.
జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలు లాభపడే అవకాశం ఉందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ వాదిస్తోంది. ఈక్రమంలో దక్షిణాది రాష్ట్రాలను సమావేశంలో పాల్గొనాలని స్టాలిన్ ఆహ్వానం పంపారు. దీంతో మార్చి 22న చెన్నైకి శివకుమార్ రాకుండా అడ్డుకుంటామని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై హెచ్చరించారు.