ఆనంద్ దేవరకొండ, వైష్ణవి జంటగా నటిస్తున్న చిత్రం ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకత్వంలో మారుతి, ఎస్‌కేఎన్ కలిసి నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ లోపు మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన టీమ్.. మంగళవారం ఓ మెలోడీ సాంగ్‌ను విడుదల చేసింది. ‘ఏ మాయే ఇది ప్రాయమా.. అరె ఈ లోకమే మాయయా.. వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో.. వేరే ఊసే రాదే తుళ్లే ఆశల్లో.. ఇద్దరిదీ ఒకే ప్రయాణంగా.. ఇద్దరిదీ ఒకే ప్రపంచంగా’ అంటూ సాగే ఈ పాటలో హీరోహీరోయిన్స్ వింటేజ్ లుక్‌లో కనిపిస్తున్నారు.
స్కూల్ స్టూడెంట్స్ గెటప్‌తో పాటు టీనేజ్ లుక్‌లోనూ ఇంప్రెస్ చేస్తున్నారు. విజువల్స్ ప్లెజెంట్‌గా ఉన్నాయి. విజయ్ బుల్గానిన్ ట్యూన్ చేసిన పాటకు అనంత శ్రీరామ్ ఫీల్‌గుడ్ లిరిక్స్ రాశాడు. కిడ్స్ కోరస్‌తో కలిసి సింగర్ శ్రీరామ చంద్ర పాడిన విధానం బాగుంది. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య కీలక పాత్రలు పోషించారు.