
యూజ్ హీరో ఆనంద్ దేవరకొండ(Anand devarakonda) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ గం గం గణేశా(Gam Gam Ganesha). కొత్త దర్శకుడు ఉదయ్ శెట్టి(Uday shetty) తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. క్రైం అండ్ కామెడీ జానర్ లో వచ్చిన ఈ సినిమాను హైలైఫ్ బ్యానర్ పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కరుమంచి నిర్మించారు. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా నేడు(మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ పడటంతో ఆడియన్స్ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో తెలుపుతున్నారు.
మరి గం గం గణేశా సినిమా గురించి ఆడియన్స్ ఏమంటున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ట్విట్టర్ లో గం గం గణేశా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా చూసిన ఆడియన్స్ ఇది పక్కా కామెడీ ఎంటర్టైనర్ అని, ఫుల్లుగా నవ్వుకోవచ్చని చెప్తున్నారు. బేబీ తరువాత ఆనంద్ కి మరో హిట్ పడింది అంటున్నారు.
#GamGamGanesha A Complete Fun Entertainer ?@ananddeverkonda Steals The Show With His Brilliant Performance ?
— Official Srinu (@OfficialSreeNu) May 30, 2024
Director @udaybommisetty Congratulations! You Have Impressed Everyone With Ur Narrative Style & Characterisations
Music & Cinematography Are Of Top Notch Quality ? pic.twitter.com/rGmF8sM5uw
కథ, కథనం, కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, బాగా వర్కౌట్ అయ్యాయని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆనంద్ దేవరకొండ తన నటనతో మరోసారి ఆడియన్స్ ను మెప్పించాడని, ఫస్ట్ టైం తన కామెడీతో ఫుల్లుగా నవ్వించాడని చెప్తున్నారు. మొత్తంగా ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మాత్రం మంచి స్పందనే వస్తోంది.
#GamGamGanesha Day ?
— Mahesh (@starmahesh10) May 31, 2024
UK reviews bagunavi ?
Another BB loading............#AnandDeverakonda #VijayDeverakonda pic.twitter.com/LaCH0TDSj9