టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) హీరోగా వచ్చిన బేబీ మూవీ ఇండస్ట్రీ హిట్ అయినా విషయం తెలిసిందే.చిన్న సినిమాగా వచ్చి కలెక్షన్స్ విషయంలో బాక్సాపీస్ వద్ద సత్తా చాటింది.
లేటెస్ట్గా ఆనంద్ దేవరకొండ మరో మూవీతో థ్రిల్ చేయడానికి రెడీ అయ్యారు. ప్రసెంట్ గం గం గణేశా(Gamgamganesha) అనే మూవీలో నటిస్తున్నారు.డెబ్యూ డైరెక్టర్ ఉదయ్ శెట్టి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా రాబోతుంది.
ఈ మూవీని మార్చి 8వ తేదీన శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. గం గం గణేశా మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇక ఆ తర్వాత ప్రమోషన్స్ కూడా వెంటనే మొదలు పెట్టబోతున్నారు.
ప్రస్తుతానికి శివరాత్రి ఫెస్టివల్ స్పెషల్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మాస్ హీరో గోపీచంద్ నటించిన భీమా సినిమాతో పాటుగా ఒక హారర్ థ్రిల్లర్ ఎర్ర చీర రెడీగా ఉన్నాయి. ఇప్పుడు అదే డేట్ లో ఆనంద్ దేవరకొండ గం గం గణేశా సినిమా కూడా రిలీజ్ అవుతుండటంతో ఆడియన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి.
ఈ మూవీకి మెలోడీ మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య భరద్వాజ్ స్వరాలూ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్,టీజర్ చాలా ఇంటెన్సివ్ గా కనిపిస్తోంది. దొరసాని, మిడిల్‌క్లాస్ మెలొడీస్, పుష్పకవిమానం,బేబీ మూవీలో చాలా సాఫ్ట్గా కనిపించిన ఆనంద్..ఈ సినిమాతో తనలోని మాస్ యాంగిల్ ను చూపిస్తున్నట్టు టాక్.
బేబీ మూవీ హిట్ అవ్వడంతో సక్సెస్ ట్రాక్ లో ఉన్న ఆనంద్..మాస్ హీరోగా రాణిస్తాడో..లేదో చూడాలి మరి. గం గం గణేశా మూవీని హై-లైఫ్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.