
పాలమూరు, వెలుగు: కొత్త రేషన్ కార్డుల జారీ కోసం జరుగుతున్న సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ సూచించారు. పట్టణంలోని 21వ వార్డులో గురువారం ఆయన సర్వేను ప్రారంభించారు. అనంతరం వార్డుల్లో పర్యటించి సర్వే తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రేషన్ కార్డు లేని ప్రతి నిరుపేదకు కార్డులు అందజేస్తామని ఆయన చెప్పారు.