మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, అసాధారణ ప్రతిభను ఎల్లప్పుడూ అభినందిస్తూ, ప్రోత్సహిస్తూ ఉంటారు. తన తాజా పోస్ట్‌లో, 16 ఏళ్ల ఆర్చర్, హాంగ్‌జౌలో జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో భారతదేశం కోసం రెండు స్వర్ణ పతకాలతో పాటు రజతం తెచ్చిపెట్టిన శీతల్ దేవిపై తనకున్న అభిమానాన్ని ఎక్స్‌లో వ్యక్తం చేశారు.
తనదైన ప్రతిభతో పారా గేమ్స్ లో సత్తా చాటిన శీతల్ దేవికి ప్రత్యేక కారును బహుమతిగా ఇస్తానని ఆనంద్ మహీంద్రా మాటిచ్చారు. తన కంపెనీకి చెందిన కార్లలో దేన్నైనా ఎంచుకోవచ్చని కూడా ఆమెకు ఆఫర్ ఇచ్చారు. దాంతో పాటు దాన్ని ఆమె ప్రత్యేక అవసరాలకనుగుణంగా తీర్చిదిద్ది అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఆమె ప్రతి ఒక్కరికీ టీచర్ అని చెప్పారు. ఇకపై తాను చిన్న చిన్న సమస్యలపై కంప్లైంట్ చేయనని, పరోక్షంగా ఆమెకు ఉన్న అవరోధాల ముందు తమ మన సమస్యలు చాలా చిన్నవని చెప్పారు.
- ALSO READ | ODI World Cup 2023: కోహ్లీ, ధోనీని దాటేసిన రోహిత్.. కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌కు వందో మ్యాచ్
ఇటీవల జరిగిన పారా ఆసియా క్రీడల్లో శీతల్ దేవి.. రెండు చేతులు లేకపోయినా రెండు గోల్డ్ మెడల్స్ తో రికార్డు సృష్టించింది. ఫైనల్లో అలీమ్ సహిదా(సింగపూర్)ను ఓడించి పసిడి సొంతం చేసుకుంది. మిక్స్డ్ టీమ్ లో స్వర్ణం గెలిచింది. దీంతో జమ్ము కశ్మీర్ కు చెందిన శీతల్ దేవి.. ఒకే క్రీడల్లో రెండు పసిడి పతకాలు నెగ్గిన తొలి భారత మహిళా అథ్లెట్ గా ఘటన సాధించారు.
I will never,EVER again complain about petty problems in my life. #SheetalDevi you are a teacher to us all. Please pick any car from our range & we will award it to you & customise it for your use. pic.twitter.com/JU6DOR5iqs
— anand mahindra (@anandmahindra) October 28, 2023