సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా. తన అనుభవాలను అందులో పంచుకుంటూ ఉంటారు. సృజనాత్మకత, ప్రతిభ ఉన్నవారిని ఆయన ఎంకరేజ్ చేస్తుంటారు. తాజాగా ఆయన చేసిన ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాకు చెందిన 13 ఏళ్ల నికిత 15 నెలల వామిక అనే తన మేనకోడలుతో కలిసి ఇంట్లో ఆడుకుంటున్న టైమ్ లో కోతులు అక్కడికి వచ్చాయి. ఇంట్లోని వస్తువులను చిందరవందరగా పడేశాయి. ఈ క్రమంలో ఓ కోతి నికిత, వామికల వద్దకు వచ్చింది. ఇంట్లో ఎవరూ లేరు. అయినప్పటికీ నికిత భయడలేదు. కోతుల నుంచి బయటపడేందుకు సమయస్ఫూర్తితో ఆలోచించింది.
The dominant question of our era is whether we will become slaves or masters of technology.
— anand mahindra (@anandmahindra) April 6, 2024
The story of this young girl provides comfort that technology will always be an ENABLER of human ingenuity.
Her quick thinking was extraordinary.
What she demonstrated was the… https://t.co/HyTyuZzZBK
వెంటనే ఆ బాలికకు ఇంట్లో ఉన్న వర్చువల్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సా గుర్తుకు వచ్చింది. అలెక్సా కుక్కలా గట్టిగా ఆరువు అంటూ ఆదేశించింది నికిత. ఆ వెంటనే అలెక్సా కుక్కలా మొరుగుతున్నట్లుగా పెద్దగా శబ్దాలు చేయడంతో అక్కడి నుండి కోతుల గుంపు పారిపోయింది. బాలిక సమయస్ఫూర్తికి ఫిదా అయిపోయిన అనంద్ మహింద్రా చదువు పూర్తయిన తర్వాత మహీంద్రాలో ఆ బాలికకు ఉద్యోగం ఇప్పిస్తానని పోస్ట్ చేశారు. నికితా తన చదువు పూర్తయిన తర్వాత తమతో చేరుతుందని మహీంద్రా ఆశాభావం వ్యక్తం చేశారు. క్షణాల్లోనే ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.