- ఆర్మీలో చేరేందుకు కష్టపడ్తున్న ఉత్తరాఖండ్ యువకుడు ప్రదీప్ మెహ్రా
- పగలు పనిచేస్తూ.. రాత్రిపూట పరుగు తీస్తున్న ప్రదీప్ మెహ్రా
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
న్యూఢిల్లీ: టీనేజీ కుర్రాళ్లు టైం దొరికితే చాలు ఫ్రెండ్స్ తో కలిసి ముచ్చట్లు చెప్పుకుంటరు. షికార్లు కొట్టాలనుకుంటరు. కానీ, ఉత్తరాఖండ్‌కు చెందిన 19 ఏండ్ల ప్రదీప్ మెహ్రా మాత్రం ఇంటి బాధ్యతలు ఎత్తుకున్నడు. పొద్దంతా జాబ్ చేస్తున్నడు. రాత్రి పూట 10 కిలోమీటర్లు పరిగెడుతున్నడు. అట్ల పరిగెత్తుతుండగా ఓరోజు రాత్రి సిన్మా డైరెక్టర్ వినోద్ కప్రీ దృష్టిలవడ్డడు. ఎందుకని అడిగితే తాను రోజు ఇట్లనే ఇంటికిపోతనని చెప్పిండు. కార్లో లిఫ్ట్ ఇస్తా.. రా అని పిలిస్తే.. తన ప్రాక్టీస్ గాడి తప్పుతదన్నడు. ఏంటిదా ప్రాక్టీస్ అంటే.. ఆర్మీలో చేరడమే తన గోల్ అని, అందుకే ప్రతిరోజు డ్యూటీ అయిపోంగనే ఇంటిదాకా పరిగెడుతున్నా అని చెప్పేసరికి ఆ డైరెక్టర్ ఫిదా అయిండు.
డిన్నర్ చేద్దామని పిలిచినా రాలే. ఇంటికాడ అన్న నైట్ డ్యూటీ పోతడు.. వంట చేసి పెట్టాలని ప్రదీప్ సమాధానమిచ్చిండు. పైగా అమ్మ ఆస్పత్రిలో ఉందని, ఇంటిబాగోగులు చూస్కోవాలన్నడు. డైరెక్టర్ వినోద్ కప్రీ దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చూసినోళ్లంతా ఫిదా అయితున్నరు. అతడికున్న పట్టుదలకు హ్యాట్సాఫ్ అంటూ మెచ్చుకుంటున్నరు.
అల్మోరా జిల్లాకు చెందిన ప్రదీప్ మెహ్రా నోయిడా దగ్గర్లోని బరోలాలో నివాసం ఉంటున్నాడు. అనారోగ్యంతో ఉన్న తల్లి ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతోంది. అతని అన్న నైట్ డ్యూటీ చేస్తున్నడు. నోయిడాలోని మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లో పనిచేస్తూ ఇంటికి ఆసరాగా ఉంటున్నడు. తన టార్గెట్ నెరవేర్చుకునేందుకు ప్రతిరోజు రాత్రి డ్యూటీ పూర్తికాగానే బలోరాలోని ఇంటిదాకా రన్నింగ్ చేస్కుంట పోతున్న అని చెప్తున్నడు.
ఈ యువకుడ్ని చూసి స్ఫూర్తి పొందా: ఆనంద్ మహీంద్రా
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ స్పందించే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రదీప్ మెహ్రా వీడియోను చూసి స్పందించారు. ఆర్ధిక ఇబ్బందుల వల్ల.. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలిచేందుకు ఉద్యోగంలో చేరి.. భారత సైన్యంలో చేరాలన్న తన కోరిక నెరవేర్చుకునేందుకు అవసరమైన శిక్షణ తీసుకునే అవకాశం లేక.. రాత్రి డ్యూటీ ముగిశాక 10కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవడం నిజంగా స్ఫూర్తిదాయకమన్నారు. ‘‘ఈ యువకుడి జీవితం నుంచి నేను కూడా స్ఫూర్తి పొందాను.. ఏమిటో తెలుసా.. ఇతడు ఎవరి ీద ఆధారపడని వ్యక్తి.. కారులో లిఫ్ట్ ఇస్తానన్నా నిరాకరించాడు.. అతడికి ఎవరి అవసరం లేదు.. ఆత్మనిర్భరత కలిగిన వ్యక్తి ప్రదీప్ మెహ్రా’’ అని ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో రాసుకున్నారు.
ప్రదీప్‌కు సాయం చేస్త: రిటైర్డ్ కర్నల్ సతీష్ దువా
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రదీప్ వీడియో చూసిన పలువురు ప్రముఖులు స్పందించారు. అతడి ఆత్మవిశ్వాసం అమోఘం.. అతడు సైన్యంలో చేరేందుకు అవసరమైన సాయం చేయాలనుకుంటున్నానని రిటైర్డ్ కర్నల్ సతీష్ దువా స్పందించారు. వీడియో చూసిన వెంటనే ఆర్మీ తూర్పు కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రానాతో మాట్లాడాను.. ఆర్మీ సెలెక్షన్ టెస్ట్‌లో పాస్ అయ్యేందుకు ప్రదీప్‌కు అవసరమైన శిక్షణ అందించడానికి అవసరమైన సాయంచేస్తానని రానా చెప్పారని వెల్లడించారు.
This is indeed inspiring. But you know what my #MondayMotivation is? The fact that he is so independent & refuses the offer of a ride. He doesn’t need help. He is Aatmanirbhar! https://t.co/8H1BV4v5Mr
— anand mahindra (@anandmahindra) March 21, 2022
ఇవి కూడా చదవండి
టీబీని లైట్ తీస్కుంటే చాలా డేంజర్
యుద్ధం మొత్తం ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తోంది
భారత్ పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు