చెట్ల మీద ఉండే పండ్లను కోయడానికి చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. చెట్టు ఎక్కి పండ్లను కోసే సమయంలో గాయాలపాలవుతుంటారు. వీరి సమస్యకు ఓ వ్యక్తి చెక్ పెట్టాడు. ఆ సాధనంతో చెట్లకు కాసిన పండ్లను సులభంగానే కోయవచ్చు. ప్లాస్టిక్ బాటిల్, ప్లాస్టిక్ పైపు, ఓ తాడును ఉపయోగించి ఓ పరికరాన్ని తయారు చేశాడు యువకుడు. దీనితో ఓ వృద్ధుడు చెట్లపై ఉన్న పండ్లను కోశాడు. అధిక ఎత్తులో ఉన్న పండ్లను దీనిని ఉపయోగించి కట్ చేసుకోవచ్చు. చెట్టు ఎక్కకుండానే.. రాళ్లతో కొట్టకుండా ఈజీగా చెట్లపై ఉన్న పండ్లను కోసుకోవచ్చని ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. ఈ వీడియోను చూసి తాను సంతోషించినట్లు ఆనంద్ మహీంద్రా ట్వీట్ లో తెలిపారు. భూమికి ఏ విధంగానూ హాని కలిగించదని, ఇలాంటి ప్రయోగాలు సంస్కృతిని ప్రతిబింబిస్తాయన్నారు. ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Not an earth-shattering invention. But I’m enthusiastic because it shows a growing culture of ‘tinkering.’ America became a powerhouse of inventiveness because of the habit of many to experiment in their basement/garage workshops. Tinkerers can become Titans of innovation. ?????? pic.twitter.com/M0GCW33nq7
— anand mahindra (@anandmahindra) June 2, 2022
మరిన్ని వార్తల కోసం : -
అమెరికా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది
ఒంటి కాలితో రోజుకు 2 కి.మీ నడుస్తూ పాఠశాలకు