చాలా మంది కొత్త సంవత్సరం వస్తుందనగానే ఏదో ఒక కొత్త నిర్ణయంతో ముందుకెళ్లాలని, ఇంతకు ముందు చేయాలనుకున్న పనిని ఇప్పటి నుంచి అయినా మొదలు పెట్టాలనే రిజల్యూషన్ పెట్టుకుంటారు. కానీ.. ఆ తర్వాత వాటిని ఫుల్ ఫిల్ కోసం కొంతమందే ప్రయత్నిస్తుంటారు. మరికొంత మంది కొన్నాళ్ల తర్వాత దాన్ని లైట్ తీసుకుంటారు. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మాత్రం కొత్త సంవత్సరంలో మొదటి రోజు ఎలా ఉంటామో.. వారం మధ్యలో ఎలా అనిపిస్తుందో కొన్ని ఫొటోల ద్వారా తెలియజేశారు.
ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫొటోలలో మొదటి రోజు ఎక్సైజ్ చేయడానికి కసరత్తు ప్రారంభించినట్టు, రెండో రోజు కొంచెం మందగించినట్టు, మూడో రోజు ఇంకాస్త బద్దకంగా మారినట్టు, ఇక నాలుగో రోజుకి వచ్చేసరికి ఏం చేస్తాములే అన్నట్టు దుప్పటి కప్పుకొని పడుకున్నట్టు ఉన్న పిక్స్ ను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అంతేకాకుండా వేలల్లో వ్యూస్, లైక్స్ వచ్చాయి. దాంతో పాటు ఈ పోస్ట్ పై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. అందులో ఒకరు “గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్.. నేను మీ క్లబ్‌లో చేరాను సార్.. కొత్త సంవత్సర తీర్మానాన్ని ఎవరు బ్రేక్ చేయాలనుకుంటున్నారు.. ఒక టెంప్టింగ్ ఆఫర్.. హహహ హా" అంటూ ఛలోక్తులు విసిరారు. మంచి పని చేయాలనుకున్నపుడు సమయం కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని ఒకరు,“విశ్రాంతి/నిద్ర ఉత్తమ ఔషధం. ఏ వ్యాయాం.. నిద్ర/విశ్రాంతిని భర్తీ చేయదు" అంటూ కామెంట్ చేశారు.