ఆటో డ్రైవర్ పై ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్

  • ఆటో డ్రైవర్ కాదు.. మేనేజ్మెంట్ ప్రొఫెసర్ అంటూ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

ఓ ఆటో డ్రైవర్ గురించి మహీంద్ర సంస్థ అధినేత ఆనంద్ మహీంద్ర చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఆటో ఎక్కే ప్రయాణికులకు ఈ ఆటో డ్రైవర్ కల్పిస్తున్న సదుపాయాలు ఆనంద్ మహీంద్ర అభినందనలకు కారణం. చెన్నైకు చెందిన అన్నాదురై తన ప్రయాణికుల కోసం సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఐటీ సంస్థలు ఎక్కువగా ఉండే చెన్నై OMR ప్రాంతంలో అన్నాదురై ఆటో నడుపుతుంటాడు. ఐటీ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని తన ఆటోలో వైఫై, ల్యాప్ టాప్, ట్యాబ్, అమెజాన్ ఎకో, వార, వార్త పత్రికలు, బిజినెస్ మేగజైన్లతోపాటు తాగేందుకు వాటర్ బాటిల్స్ కూడా సిద్ధంగా ఉంచుకుంటాడు. ఇతని ఆటోలో ఒకసారి ప్రయాణిస్తే చాలు.. మళ్లీ ఇతని కోసమే ఎదురు చూస్తారు. ఐటీ ప్రొఫెషనల్స్ తోపాటు ఎక్కువ మంది అన్నాదురై ఆటోనే ప్రయాణిస్తున్నారు. 
ఐఐటీ..ఐఐఎంలలో ప్రసంగించిన ఆటోవాలా
అన్నాదురై ఐడియా పలు వ్యాపార సంస్థలను ఆకర్షించింది. వారి ఆహ్వానంతో అన్నాదురై ఐఐటీ, ఐఐఎంలలో కూడా ప్రసంగించారు. దీనికి సంబంధించి ఓ ఛానల్ విడుదల చేసిన వీడియోను ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ లో షేర్ చేశారు. అన్నాదురై నుంచి మనం చాల నేర్చుకోవాలంటూ ప్రశంసించారు. అంతేకాకుండా ఎంబీఏ విద్యార్థులు ఆయనతో ఓక రోజు టైం స్పెండ్ చేస్తే కస్టమర్ ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ కోర్సుగా ఉపయోగ పడుతుందన్నారు. అలాగే ఇతనొక ఆటో డ్రైవర్ కాదు..మేనేజ్మెంట్ లో ప్రొఫెసర్ అని ప్రశంసించారు.

 

ఇవి కూడా చదవండి

ఏపీలో ఇవాళ కూడా 14వేలు దాటిన కేసులు

తల్లి ఫోన్‌లో గేమ్ ఆడుతూ లక్షన్నరకు ఫర్నీచర్ ఆర్డర్

రాపూరు అడవుల్లో 'పుష్ప' సినిమా తరహా సీన్