సర్కార్ వారి పాట సినిమా చూస్తా

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు న్యూ ఫిల్మ్ ‘సర్కారు వారి పాట’ నయా రికార్డులను సృష్టిస్తోంది. ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి.. కలెక్షన్స్ లలో రికార్డులను కొల్లగొడుతోంది. మహేశ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. సర్కారు వారి పాట రిలీజైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 160.2 కోట్ల గ్రాస్.. రూ. 100.44 కోట్ల షేర్ ను సాధించి రికార్డు నెలకొల్పింది. పలువురు ఈ చిత్రాన్ని చూసి మహేష్ నటనపై ప్రశంసలు కురిపించారు.

తాజాగా.. ఈ మూవీపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ఎప్పుడూ సామాజిక, స్పూర్తినిచ్చే అంశాలపై మహీంద్ర ట్వీట్స్ చేస్తున్నారనే సంగతి తెలిసిందే. అనుపమ్ తరేజా పోస్టు చేసిన ఓ వీడియోకు స్పందనగా ఆయన రీ ట్వీట్ చేశారు. ‘అన్ బిటబుల్ కాంబినేషన్ అయిన మహేశ్, జావా మెరూన్ లను చూడకుండా ఎలా ఉండగలను అంటూ ట్వీట్ లో తెలిపారు. జావాపై మహేశ్ బాబు రైడ్ గురించి ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం తాను న్యూ యార్క్ లో ఉన్నట్లు, న్యూ జెర్సీలో ఎక్కడ సినిమా ప్రదర్శన ఉంటుందో.. అక్కడకు వెళ్లి చూస్తానని తెలిపారు. ఆయన చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. జావా మోటార్ సైకిల్ వాస్తవానికి మహీంద్రా & మహీంద్రా బ్రాండ్ బైక్. దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత.. ఈ బైక్ ఇండియాకు వచ్చింది. క్లాసిక్ లెజెండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై అమ్మకాలు జరుగుతున్నాయి.
 

ఇప్పటికే కెరీర్ లో ది బెస్ట్ హీరో బ్రాండ్ తో దూసుకు పోతున్నారు టాలీవుడ్ ప్రిన్ మహేశ్. ఈ సినిమా మరో అద్భుత విజయాన్ని అందించింది. బ్రహ్మోత్సవం, స్పైడర్ లాంటి బ్యాక్ టు బాక్ ఎపిక్ డిజాస్టర్ మూవీస్ తర్వాత మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో భరత్ అనే నేను సినిమా భారీ అంచనాలను క్రియేట్ చేసింది. అదే ఉత్సాహంతో సాగిన మహేశ్ తర్వాతి చిత్రం మహర్షి మూవీ కూడా రికార్డులను బద్దలు కొట్టి విజయ దుందుభి మోగించింది. ఇకపోతే సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని.. హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఇప్పుడు సర్కారు వారి పాట చిత్రంతో అభిమానులను మరోసారి అలరించారు. తెలుగు సినీ చరిత్రలో ఇలా 4 సార్లు రీజనల్ మూవీస్ తో 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసి చరిత్రలో నిలిచారు సూపర్ స్టార్. ఏదేమైనా 4 సార్లు 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని ఇలాంటి రికార్డ్ ను నమోదు చేయడంపై మహేశ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం : -
 

సిటీలో క్రమంగా పెరుగుతున్న సైకిళ్ల వాడకం

సర్కారువారి పాట.. రిలీజ్కు ముందే జోష్..

రివ్యూ: సర్కారు వారి పాట