ఫ్లయింగ్ ట్యాక్సీ ఫొటోలు షేర్.. IIT మద్రాస్కు ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

ఫ్లయింగ్ ట్యాక్సీ ఫొటోలు షేర్.. IIT మద్రాస్కు ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీని అభివృద్ధి చేస్తున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ స్టార్టప్‌ను మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. సంస్థ ప్రపంచంలోని అత్యంత చురుకైన ఇంక్యుబేటర్‌లలో ఒకటి అని అన్నారు. ఎగిరే ఎలక్ట్రిక్ టాక్సీని నిర్మించడానికి సిద్దమైన ఐఐటీ మద్రాస్‌లో భాగమైన ePlane  కంపెనీనీ ఆయన ప్రశంసిస్తూ తన X బ్లాగ్ లో పోస్ట్ చేశారు. 

భారతదేశంలో అత్యంత వేగంగా పెరుగుతునన ప్రతిష్టాత్మక ఇంక్యుబేటర్లతో రాబోయే కాలంలో అనేక ఆవిష్కరణలు చూడబోతున్నామంటూ రాశారు. IIT మద్రాస్ సహా  భారతదేశంలోని ఇతర ప్రతిష్టాత్మక ఇంక్యుబేటర్లు ప్రపంచ వేదికపై దేశం ఆవిష్కరణ సామర్థ్యాలను ప్రదర్శిస్తాయని ఆనంద్ మహీంద్రా అన్నారు. ఇదంతా దేశంలో స్టార్టప్ కంపెనీలకు పెరుగుతున్న ప్రోత్సహామే కారణమ న్నారు. 

భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ ఫ్లయిగ్ టాక్సీ ఫొటోలను తన X పోస్టులో షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. మద్రాస్ ఐఐటీ కి చెందిన ePlane  స్టార్టప్ కంపెనీ దేశ రవాణా ఆవిష్కరణలో గొప్ప ముందడుగు వేస్తోందని అన్నారు. అభినందనలు తెలిపారు. ఈ పోస్ట్ చేసిన కొద్ది గంటల్లో లక్షా 90 వేల మంది చూశారు. లైకులు కొట్టారు.. పెద్ద ఎత్తున ప్రశంసల జల్లు కురిపిస్తూ కామెంట్లు పెట్టారు. 

ఎలక్ట్రిక్ ఫ్లయిగ్ టాక్సీ  తయారీ సంస్థ ePlane

చెన్నైకి చెందిన డీప్ టెక్ స్టార్టప్ అయిన ePlane సంస్థ..ఫ్లయింగ్ ఎలక్ట్రిక్ టాక్సీలను అభివృద్ధి చేయడానికి గత ఏడాది మే 23న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నుంచి ఆమోదం పొందింది. భారతదేశంలో మొదటి ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీగా అవతరించింది.వచ్చే ఏడాదిలోగా ఎగిరే ఎలక్ట్రిక్ ట్యాక్సీని తయారు చేసేందుకు ఈ కంపెనీ సిద్దమవుతోంది. 

ఎలక్ట్రిక్ ఫ్లయిగ్ టాక్సీ సామర్థ్యం 

ఎలక్ట్రిక్ ఫ్లయిగ్ టాక్సీ e200 అనేది పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక అత్యవసర రవాణాకోసం రూపొందిస్తున్న రెండు సీట్లు విమానం. ఇందులో 200 కి.మీ ప్రయాణించొచ్చు. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే దాని 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. ఇది రోడ్లపై నడిచే క్యాబ్ కంటే 10 రెట్లు వేగవంతమైనది. 160 kmph క్రూయిజ్ వేగం, 200 kmph గరిష్ట వేగం కలిగి ఉంటుంది. పైలట్లతో సహా ఇద్దరు వ్యక్తులను లేదా 200 కిలోల లగేజీని తీసుకెళ్లగలదు. ఇది eVTOL విమానం నిలువు టేకాఫ్, హోవర్ , ల్యాండింగ్ కోసం విద్యుత్ శక్తిని ఉపయోగిస్తుంది. 

మరోవైపు మేలో ప్రొఫెసర్ అత్యనార్యణన్ చక్రవర్తిచే 2019లో స్థాపించబడిన సంస్థ.. దాని నమూనా విమానం ePlane e50 ని విజయవంతంగా పరీక్షించింది.