
ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ 'శివంగి' దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో పి.సురేష్ బాబు నిర్మించారు. ఆదివారం ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందులో వరలక్ష్మి పోలీస్ ఆఫీసర్ గా కనిపించగా, ఆనంది హౌస్ వైఫ్ పాత్రలో నటించింది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో అనందికి ఏం జరిగిందనేది ఆసక్తికరంగా టీజర్‌ను కట్ చేశారు.
ఆ కేసును సాల్వ్ చేసే ఆఫీసర్ సారిక సింగ్ గా వరలక్ష్మి నటన ఇంటెన్స్ గా ఉంది. ''సత్యభామ అంటే ఏదో చందమామ కథలు చెప్పే బామ్మ అనుకున్నావేమో... ఇక్కడ బ్యూటీ నేనే, బీస్ట్ నేనే' అని ఆనంది తన పాత్రను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంది జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఎబి నేజర్ పాల్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మార్చి 7న విడుదల కానుంది.