OTT Suspence Thriller: ఓటీటీలోకి తెలుగు స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Suspence Thriller: ఓటీటీలోకి తెలుగు స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఆనంది, వరలక్ష్మి శరత్‌‌కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన  విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘శివంగి’ (Shivangi).దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో పి.సురేష్​ బాబు నిర్మించారు. జాన్ విజయ్, డా. కోయ కిషోర్ కీలక పాత్రల్లో నటించారు.

ఇందులో వరలక్ష్మి పోలీస్ ఆఫీసర్గా కనిపించగా, ఆనంది హౌస్ వైఫ్ పాత్రలో నటించింది. ఎబి నేజర్ పాల్ సంగీతం అందించిన ఈ మూవీ 2025 మార్చి 7న విడుదలైంది. ఈ మూవీకి థియేట‌ర్ ఆడియన్స్ నుంచి మిక్స్‌డ్ టాక్‌ వచ్చింది.

ఆనంది, వరలక్ష్మిల నటన బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయినప్పటికీ ఈ మూవీ IMDBలో 8.9 రేటింగ్‌ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. శివంగి మూవీ సడెన్గా ఓటీటీలోకి అడుగుపెట్టింది.

నేడు గురువారం ఏప్రిల్ 17న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్నప్పటికీ, స్క్రీన్ ప్లే సీరియల్ మాదిరి సాగడంతో పెద్దగా ఆడలేదు. ఇదే ఈ సినిమాకు ప్రధాన మైనస్ గా నిలిచింది. 

కథేంటంటే:

సత్యభామ(ఆనంది) ఓ సాధారణ గృహిణి. పెళ్లైనా మొద‌టి రాత్రే భ‌ర్త‌కు యాక్సిడెంట్ అయ్యి మంచాన ప‌డ‌తాడు. అలా ఓ వైపు భర్త అనారోగ్య పరిస్థితులు... మరో వైపు ఆర్థిక సమస్యలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. భ‌ర్త‌కు ఆప‌రేష‌న్ చేయించ‌డం క‌ష్టాలు ప‌డుతుంది. దానికి తోడు తన అత్త నుంచి ఎదురయ్యే వేధింపులు తనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తాయి. మ‌రోవైపు ఆఫీస్‌లో బాస్ లైంగిక వేధింపులు. ఇంకోవైపు తల్లిదండ్రులు అనుకోకుండా వరదల్లో చిక్కుకు పోవడంతో మరింత సతమతమవుతుంది.

ఈ క్రమంలో అనుకోకుండా ఓ కేసు విష‌యంలో స‌త్య‌భామ‌ను విచారించ‌డానికి పోలీసులు ఆమె ఇంటికి వస్తారు. కేసును ఇన్వేస్టిగేట్ చేసిన ఆఫీస‌ర్ (వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌). సత్యభామ నుంచి పోలీస్ ఆఫీస‌ర్ ఎలాంటి నిజాలు తెలుసుకుంది? సత్యభామ వల్ల ఎవరైనా హత్యకు గానీ, ఆత్మహత్యకు గానీ గురయ్యారా? ఈ చిక్కులన్నీటీ మధ్యన సత్యభామ ఎలా పోరాడింది? చివరికి ఏమైందనేది మిగతా సివంగి కథ.