Garividi Lakshmi: గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కొత్త సినిమా

Garividi Lakshmi: గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కొత్త సినిమా

హీరోయిన్ ఆనంది టైటిల్ రోల్‌‌‌‌లో నటిస్తున్న చిత్రం ‘గరివిడి లక్ష్మి’. నరేష్,   రాశి,  రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. దర్శకుడు గౌరీ నాయుడు జమ్మూ రూపొందించనున్న ఈ చిత్రంతో టీజీ విశ్వ ప్రసాద్ కూతురు టీజీ కృతి ప్రసాద్ నిర్మాతగా పరిచయం అవుతున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో తెరకెక్కనున్న 48వ చిత్రమిది.  ఆంధ్రప్రదేశ్‌‌‌‌లోని ఆదోనిలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.  ఎమ్మెల్యే పార్ధసారధి ముహూర్తపు షాట్‌‌‌‌కు  క్లాప్‌‌‌‌ కొట్టగా, ఎమ్మెల్సీ మధు, మల్లప్ప నయాకర్ ‌‌‌‌కెమెరా స్విచాన్‌‌‌‌ చేశారు.

జనవరి మూడో వారం నుంచి ఆదోనిలో రెగ్యులర్ షూటింగ్‌‌‌‌ను స్టార్ట్ చేయనున్నట్టు మేకర్స్ తెలియజేశారు.ఈ చిత్రం ఉత్తర ఆంధ్రాకు చెందిన బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా రూపొందించనున్నారు.  చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు.