- ప్రారంభించిన అనంత్ అంబానీ
హైదరాబాద్, వెలుగు : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) డైరెక్టర్ అనంత్ అంబానీ, బ్రిటిష్ పెట్రోలియం (బీపీ) సీఈఓ ముర్రే ఆచిన్‌క్లోస్ గురువారం జియో- బీపీ 500వ జియో -బీపీ పల్స్ ఈవీ- చార్జింగ్ స్టేషన్‌ను ముంబైలో ప్రారంభించారు. జియో–బీపీ అనేది రిలయన్స్, గ్లోబల్ ఎనర్జీ కంపెనీ బీపీ ఏర్పాటు చేసిన మొబిలిటీ జాయింట్ వెంచర్. దీనిని ప్రారంభించడం వల్ల ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్, జియో వరల్డ్ ప్లాజా, జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అతిథులకు చార్జింగ్ సదుపాయం లభిస్తుందని రిలయన్స్ తెలిపింది.
తమ ఈవీ- ఛార్జింగ్ స్టేషన్‌ల నెట్‌వర్క్ కేవలం ఒక సంవత్సరంలోనే 1,300 నుంచి 5,000 వరకు పెరిగిందని పేర్కొంది. ఇదిలా ఉంటే రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ వయాకామ్ 18 బోర్డులో చేరారు. ఇది ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ , బోధి ట్రీ సిస్టమ్స్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ వ్యాపారాన్ని కలిగి ఉన్న హోల్డింగ్ కంపెనీ.