రేపటి నుంచి గణేష్ నవరాత్రి ఉత్సవాలు.. సందడి మొదలైంది.. ఎక్కడ చూసినా గణేషుడి మండపాలే..వివిధ ఆకారాల్లో గణేషుల ప్రతిమలే కనిపిస్తున్నాయి. గల్లీకో మండపం..ఇంటికో వినాయకుడు.. గణేషుడి ఉత్సవాల నిర్వహణలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.. తెలంగాణలో అయితే ఖైరతాబాద్ గణేషుడు, బాలాపూర్ గణేషుడు అంటే మస్తు ఫేమస్.. అలాగే ముంబైలో కూడా లాల్ బౌగ్చా ప్రాంతాల్లో ప్రతిష్టించే వినాయకుడికి ప్రత్యేకత ఉంది.. ఈసారి లాల్ బౌగ్చా గణేషుడు ప్రత్యేక ఆకర్షణతో కొలువుదీరాడు..
గణేష్ చతుర్థి సమీస్తోన్న వేళం..ముంబైలో లాల్ బౌగ్చా రాజా గణేషుని ఈ ఏడాది ప్రతిమను ఆవిష్కరించారు నిర్వాహకులు. ఇప్పుడు అందరి దృష్టి ఆ గణేషుడి విగ్ర హంపైనే.. ముఖ్యంగా లాల్ బౌగ్చా రాజా గణేషుడి ధరించిన కిరీటం మరింత ప్రత్యేకతంగా ఉంది. గంభీరంగా పీఠంపై ఆసీనుడైన గణేషుని రూపంతోపాటు ఆ కిరీటం కూడా చూపరులను బాగా ఆకట్టుకుంటోంది. అయితే లాల్ బౌగ్చా రాజా గణేషుడి కిరీటం ప్రత్యేక ఏంటీ.. ఎందుకీ కిరీటం అందరిని ఆకట్టుకుంటోంది.. దీని గురించి సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అవుతుందో తెలుసుకుందాం..
2024 లో ముంబైలో కొలువు దీరిన లాల్ బౌగ్చా రాజా గణేషుడి విగ్రహ ప్రతిమకు ఓ ప్రత్యేకత ఉంది.. అందేంటంటే.. ఈ గణేషుడి కిరీటాన్ని 20కిలోల బంగారంలో తయారు చేశారు. దీనిని ప్రముఖ వ్యాపార వేత్త, బిలియనర్ అయిన ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ దీనిని లాల్ బౌగ్చా గణేషుడిని గిఫ్ట్ గా బహుకరించాడు..దీని విలువు రూ. 15 కోట్లు ఉంటుంది.
గణేష్ ఉత్సవాల ప్రారంభానికి రెండు రోజులు ముందు సెప్టెంబర్ 5న ముంబైలోని లాల్ బౌగ్చా రాజా విగ్రహాన్ని రివీల్ చేశారు నిర్వాహకులు. గణేషుడి ఫస్ట్ లుక్ .. మెరూర్ కలర్ దుస్తులు, అద్భుతమైన అరుదైన నగలతో అలంకరించబడి ఉంది. ఈ ఏడాది లాల్ బౌగ్చా వినాయకుడి ప్రధాన ఆకర్షణగా 20 కిలోల బంగారంతో చేసిన కిరీటం.. దీనిని రెండు నెలల క్రితమే తయారు చేయించారు అనంత్ అంబానీ.
లాల్ బౌగ్చా రాజాతో అనంత్ అంబానీకి15 ఏళ్ల అనుబంధం ఉంది. వివిధ కార్యక్రమాల ద్వారా అనంత్ అంబానీ లాల్ బౌగ్చా గణేష్ ఉత్సవ కమిటీకి పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. ప్రతియేటా గిర్గావ్ చౌపాటీ బీచ్ లో జరిగే గణేష్ గ్రాండ్ నిమజ్జన వేడుకలకు హాజరవుతున్నారు.
లాల్‌బాగ్ రాజుగా పిలువబడే లాల్‌బాగ్చా రాజా గణేషుడు.. ముంబైలో అత్యధికంగా సందర్శించే గణేష్ మండపాలలో ఒకటి. ప్రతి సంవత్సరం పూజ్యమైన విగ్రహాన్ని చూసేందుకు అన్ని వర్గాల భక్తులు క్యూ కడతారు. ముంబైలోని గణేష్ ఉత్సవాల్లో ఇది ప్రధాన ఆకర్షణగా ఉంటుంది.