Anant Ambani: అంబానీల పెళ్లిలో ఆ హీరోలకు గిఫ్ట్ గా ఇచ్చిన వాచీల విలువ అన్ని కోట్లా..

Anant Ambani: అంబానీల పెళ్లిలో ఆ హీరోలకు గిఫ్ట్ గా ఇచ్చిన వాచీల విలువ అన్ని కోట్లా..

అనంత్ అంబానీ రాధికా మర్చంట్ ల పెళ్లి విశేషాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.రాజుల కాలం నాటి పెళ్లిని తలపించే రీతిలో అంగరంగ వైభవంగా జరిగింది వీరి వివాహ వేడుక. కొత్త జంట వేసుకున్న బట్టలు, నగల దగ్గర నుండి అతిధులకు వడ్డించిన భోజనాల వరకు ప్రపంచ ప్రపంచమంతా చర్చించుకునేంత ఘనంగా జరిగాయి ఏర్పాట్లు. ఇదిలా ఉండగా, అనంత్ అంబానీ పెళ్ళికి హాజరైన తన స్నేహితులకు గిఫ్ట్ గా వాచీలు ఇచ్చారు. ఆ ఒక్కో వాచీ విలువ రూ.2 కోట్లని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

అనంత్ అంబానీకి బాలీవుడ్‌లో బోలెడంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్లలో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ సహా తదితరులు ఉన్నారు. వీరికి తన పెళ్లి సందర్భంగా అనంత్ అంబానీ ఖరీదైన వాచీలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.లగ్జరీ వాచీలకు పెట్టింది పేరైన 'అడెమార్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ పెర్పుట్యల్ కాలండెర్' అనే వాచీనీ అనంత్ గిఫ్ట్ గా ఇచ్చాడు.

రూ.2 కోట్ల విలువైన ఆ వాచీల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ వాచీలతో బాలీవుడ్ స్టార్స్  షారుక్, రణ్‍‌వీర్ పోజులిచ్చిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.