ముఖేష్ అంబానీ.. ప్రపంచంలోనే ధనవంతుడు. చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లిని అంగరంగ వైభవంగా చేస్తున్నాడు. ఏడాది కాలంగా ముందస్తు ఈవెంట్స్ చేస్తున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే పెళ్లి రోజుకు ముందు.. జూలై 11వ తేదీ రాత్రి పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో పెళ్లి కొడుకు అనంత్ అంబానీ ధరించిన బ్లూ డైమండ్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉంది. అప్పట్లో ఇంగ్లాండ్ మహారాణి ఎలిజిబిత్ ఇలాంటి వజ్రం ధరించారని.. మళ్లీ అలాంటి వజ్రం అనంత్ అంబానీ చొక్కాపై చూశాం అంటున్నారు నెటిజన్లు..
ఈ డైమండ్ విశేషాలు ఇలా :
>>> డైమండ్ పై పులి బొమ్మ ఉంది. ఇది 18 క్యారట్ల బంగారంతో తయారైంది.
>>> పులిలో నల్లటి చుక్కలు ఉన్నాయి కదా.. అది పెయింట్ కాదు.. 604 చిన్న వజ్రాలు అవి.
>>> పులి కళ్లకు రెండు వజ్రాలు పెట్టారు.
>>> పులి బంగారు వజ్రం ఉంది కదా.. దీని ధరే 2 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా.
>>> ప్రధానమైన వజ్రం ఉంది కదా.. ఇది నీలం రంగులో ఉంది.
>>> ఈ వజ్రం ఖరీదు కోట్లలో ఉంటుందని చెబుతున్నారు బంగారం వ్యాపారులు. కనీసం నాలుగు కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు అని అంచనా.
>>> అంటే ఓవరాల్ గా అనంత్ అంబానీ ధరించిన ఒక్క వజ్రం ఖరీదు 6 కోట్ల రూపాయలు.
జంతువులపై అత్యంత ప్రేమ చూపించే అనంత్.. అందుకు తగ్గట్టుగానే తాను ధరించే బంగారం, వజ్రాలపై జంతువుల సింబల్స్ ఉండే విధంగా చూసుకుంటున్నారు. అనంత్ ధరించి వజ్రం చూస్తుంటే.. అప్పట్లో ఇంగ్లాండ్ మహారాణి ఎలిజిబెత్ ధరించే వజ్రం తరహాలోనే ఉందని చెబుతున్నారు. ఏదిఏమైనా వేల కోట్ల రూపాయలతో పెళ్లి వేడుక ఘనంగా చేసుకుంటున్నారు.. ఆ మాత్రం వజ్ర వైఢూర్యాలు ధరించరా ఏంటీ..