అనంతుడి పెండ్లి ఖర్చు ఎంతంటే

అనంతుడి పెండ్లి ఖర్చు ఎంతంటే

ఫైనాన్షియల్ ఎక్స్​ప్రెస్ రిపోర్ట్​ ప్రకారం, అంబానీ ఫ్యామిలీ నెట్ వర్త్ తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు. రాధిక మర్చంట్ ఫ్యామిలీ నెట్​ వర్త్ 755 కోట్ల రూపాయలు. అత్యంత ఖరీదైన పెండ్లిగా ప్రచారం పొందిన అనంత్​ అంబానీ – రాధిక మర్చంట్​ల పెండ్లికి ముందు నుంచి పెండ్లి పూర్తయ్యే వరకు జరిగిన ఖర్చు ఇది...

 

  • రాజస్తాన్​లోని నథ్​ద్వరలో 29 డిసెంబర్​ 2022న శ్రీనాథ్​జీ టెంపుల్​లో రోకా వేడుక జరిగింది. ఆ గుడిలో ఒక రోజంతా రాజ్​ భోగ్​ శ్రింగార్​ పద్ధతిలో ఆ వేడుకలు చేశారు. ఈ వేడుకకి క్లోజ్ ఫ్రెండ్స్​ మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత గతేడాది జనవరి18న మెహందీ సంబరాలు జరిగాయి.
  • జనవరి19న ముంబయిలోని యాంటిలాలో 15 వేల కోట్ల రూపాయలతో నిశ్చితార్థం చేశారు. ఆ ఈవెంట్​కి బాలీవుడ్​ నుంచి షారుక్​​ ఖాన్​, అలియాభట్​, దీపిక పదుకొణె, రణ్​వీర్ సింగ్ వంటి సినీ నటులు పాల్గొన్నారు. ఈ సెలబ్రేషన్స్ గుజరాతీల ‘గోల్ ధన’ సంప్రదాయం జరిగాయి. 
  • ఫిబ్రవరి16న జామ్​నగర్​లోని అంబానీ ఫామ్​హౌజ్​లో ‘లగాన్ లఖ్​వను’ పేరుతో ప్రి–వెడ్డింగ్ సెలబ్రేషన్ జరిగింది. జూన్​లో వెడ్డింగ్ ఇన్విటేషన్స్ పంచారు. వెండి కోవెలలో బంగారు విగ్రహాలతో ఉన్న ఎరుపు రంగు బాక్స్​లో ఆహ్వానం ఉంది. మొదటి ఇన్విటేషన్ వారణాసిలోని కాశీ విశ్వనాథ్​ టెంపుల్​లో శివుడి పాదాల దగ్గరపెట్టారు నీతా అంబానీ.
  • మార్చి1 నుంచి 3వ తేదీ వరకు జరిగిన ప్రి–వెడ్డింగ్ సెలబ్రేషన్​కి మొదటిరోజు బాలీవుడ్ నటీనటుల​తోపాటు బిల్ గేట్స్, మార్క్​ జుకర్ బర్గ్​ సహా బడా వ్యాపారవేత్తలు చాలామంది ఇందులో పాల్గొన్నారు. అలాగే పాప్​ స్టార్ రిహన్నా కూడా ఈ వేడుకల్లో పాల్గొంది. అందుకుగాను ఆమెకి దాదాపు74 కోట్ల రూపాయలు ఇచ్చారు.
  • రెండో రోజు ‘వాక్ ఆన్​ ది వైల్డ్ సైడ్’ థీమ్​తో మూడువేల ఎకరాల్లో జంతువుల కోసం ఏర్పాటు చేసిన ‘వంతారా’ని పరిచయం చేశారు. అతిథులకు జామ్​నగర్ రిఫైనరీ కాంప్లెక్స్​లో ఉన్న వంతారా టూర్​ చూపించారు. అదే రోజు రాత్రి ‘మేళా రోగ్’ పేరిట చేసిన సంగీత్​ కార్యక్రమంలో పాపులర్ సింగర్ దిల్జిత్​ దొసాంజే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతనికి దాదాపు నాలుగు కోట్ల రూపాయల వరకు పేమెంట్ అందిందట!
  • చివరి రోజు ‘టుస్కర్ ట్రైల్స్’ థీమ్​తో సెలబ్రేషన్ అందులో హస్తాక్షర్​ వేడుక జరిగింది. అందులో మ్యుజీషియన్స్ అయిన అర్జిత్ సింగ్, లక్కీ అలీ, శ్రేయా గోషల్, ఉదిత్ నారాయణ్​ పాటలతో వీనులవిందు చేశారు. ‘చమ్మక్​ చల్లో’ ఫేమ్​ ఎకోన్​ కూడా ఈ వేడుకకు హాజరయ్యాడు. అతనికి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చారు. 
  • ఈ మూడు రోజుల వేడుకల ఖర్చు.. దాదాపు1259 కోట్ల రూపాయలు. ఈ వేడుకల్లో వంద మంది చెఫ్​లతో 500 వంటకాలు చేయించారు. 51 వేలమందికి విందు భోజనం ఏర్పాటుచేశారు. అందులో నిరుపేదలు కూడా ఉన్నారు.
  •  మార్చి 29 నుంచి జూన్ 1వ తేదీ వరకు మరోసారి ప్రి–వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. అందులో ‘లా విటా ఇ ఉన్​ వియాగియో’(జీవితం ఒక ప్రయాణం) పేరుతో క్రూయిజ్​ షిప్​ జర్నీ చేశారు. అనంత్​ అంబానీ ఆరేండ్ల క్రితం రాధికకు రాసిన ప్రేమలేఖతో డిజైన్ చేసిన చీర కట్టుకుందామె.
  •  ఇటలీలో జరిగిన ప్రి– వెడ్డింగ్​ వేడుకల్లో ఆండ్రియా బోసెల్లి మ్యూజికల్ పర్ఫార్మెన్స్​ ఇచ్చారు.
  •  జులై 3న 50 మంది నిరుపేదలకు సామూహిక వివాహాలు చేశారు. ఒక్కో పెండ్లి కూతురికి బంగారు మంగళసూత్రం, ముక్కెర, ఉంగరంతోపాటు వెండి మెట్టెలు, పట్టీలు బహూకరించారు.  ప్రతి జంటకు 1.01 లక్షల రూపాయల చెక్, ఏడాదికి సరిపడా సరుకులు, ఇంటి సామాగ్రి, ఫర్నీచర్ ఇచ్చారు. 
  • జులై 4న గుజరాతీ సంప్రదాయం అయిన ‘మామెరు’ ఈవెంట్ రాధిక మర్చంట్​ ఫ్యామిలీ చేసింది. జులై 5న సంగీత్ ఘనంగా జరిగింది. పెండ్లి జులై12న, శుభ్ ఆశీర్వాద్​ జులై13న, మంగళ్ ఉత్సవ్ పేరిట వెడ్డింగ్ రిసెప్షన్​ జులై14న జరిగాయి. ఈ వేడుకలన్నింటికీ జియో వరల్డ్​ సెంటర్స్, జియో వరల్డ్ గార్డెన్ వేదిక అయ్యాయి. వీటికి ఒక రోజుకి యావరేజ్​గా15 లక్షల రూపాయల అద్దె. కాగా వేడుకల్లో భాగం చేసిన జస్టిన్ బీబర్ అనే సింగర్​కి 83 కోట్ల రూపాయల ఖర్చయిందట!