అనంత్ అంబానీ పెళ్లి కార్డ్ సోషల్ మీడియాలో వైరల్

అనంత్ అంబానీ పెళ్లి కార్డ్ సోషల్ మీడియాలో వైరల్

ఇండియన్ కుభేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం నిశ్చయమైంది. అనంత్ అంబానీ పెళ్లి రాధిక మార్చంట్ తో జూలై 12న ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ముంభైలో వీరి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కూడా జరిగిపోయింది. ఆన్ సీ ఈమెంట్ మే 29న ప్రారంభమై జూన్ 1 వరకు జరుగుతుంది. అంటే ఫ్రెంచ్ క్రూయిజ్ షిప్ లో అతిథులకు పార్టీ ఇస్తున్నారు. పార్టీకి సినీ తారలు, స్టార్ క్రికెటర్లు, రాజకీయ నాయకులు, ప్రముఖులు హాజరు కానున్నారు. 

జూలై13 నుంచి మూడు రోజుల పాటు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. జూలై 12న శుభ్ వివాహ, 13న శుభ్ ఆశీర్వాద్, 14న మంగళ ఉత్సవ్, అకా మ్యారేజ్ రిసెప్షన్ తో అంబానీ ఇంట వేడుకలు ముగుస్తాయి. వీరి పెళ్లి ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో హిందూ సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది. ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఆ పెళ్లి కార్డు ప్రత్యక్షమైంది.