రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇందు కోసం ముంబైలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. జూలై 12 న జరగనున్న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహానికి దేశ విదేశాలనుంచి ప్రముఖు లు రానున్నారు.
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ జియో వరల్డ్ సెంటర్ లో శుక్రవారం (జూలై 12) వివాహం జరగనుంది. శుభ్ వివాహ్ తో మొదలై 13న శుభ్ ఆశీర్వాద్ , 14న మంగళ్ ఉత్సవ్ వేడుకలతో ముగుస్తాయి. ఈ వేడుకలకు దేశ విదేశాలనుంచి చాలా మంది వీవీఐపీ అతిథులు, ప్రముఖులు రానున్నారు.
కనీవిని ఎరుగని రీతిలో అనంత్ అం బానీ, రాధిక మర్చంట్ వివాహం జరిపేందుకు ముఖేష్ అంబానీ దంపతులు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. పెళ్లికి ఏడు నెలల ముందు నుంచే ఏడడుగుల వేడుకకోసం సమాయత్తం చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ అత్యంత వైభవంగా నిర్వహించారు. జూలై 12న జరిగే చిన్నకుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్ంట్ పెళ్లికి రావాలని దేశ విదేశాల్లో ఉన్న అతిథులకు ఆహ్వానం పంపారు. గెస్ట్ లకోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు.మూడు పాల్కన్ 2000 జెట్ లు, 100కు పైగా విమానాలను రెంట్ కు తీసుకున్నారు.
వంటకాల విషయానికి వస్తే..
అంబానీ ఇంట వివాహ విందు అంటే అందరికి వంటకాలపై ఆసక్తి ఉంటుంది. శుక్రవారం జరిగే పెళ్లి వేడుకలో వారణాసిలో ప్రసిద్ధిచెందిన కాశీ ఛాట్ భండార్ వ్యాపారులు వంటకాలు సిద్ధం చేస్తున్నారు. మెనూలో కుల్ఫీ, ఫలూదా, టిక్కీ, టమాటా ఛాట్, పాలక్ ఛాట్, చనా కచోరీ, దహీ పూరి, బనారస్ ఛాట్ లాంటి స్పెషల్స్ ను అతిథుల కోసం సిద్ధం చేస్తున్నారు. ఫ్రీ వెడ్డింగ్ వేడుకల్లో 2వేల 5 వందల రకాల రుచులతో భోజనాలు పెట్టిన అంబానీ ఫ్యామిలీ.. పెల్లిలో దాదాపు 3వేల చురులు అతిథులకు వడ్డించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తున్నది. కేవలం భోజనాల కోసమే 230 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారట.
అనంత్, రాధికల పెళ్లికి భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రీ వెడ్డింగ్ వేడుకలకే దాదాపు 1260 కోట్లు ఖర్చు చేశారని అంచనా.. పెళ్లి జరిగే నాటికి ఓ 15వందల కోట్లు ఖర్చు చేయొచ్చని అంచనా వేస్తున్నారు అంబానీ ఫ్యామిలీ ఫాలోవర్లు.. అంతకు ముందు ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ పెళ్లికి సుమారు రూ. 700 కోట్లు ఖర్చు అయిందని అప్పట్లో అంబానీ ఫ్యామిలీ చెప్పుకొచ్చింది.