అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి పై ఈసీ వేటు

ఏపీలో మరో అధికారిపై బదిలీ వేటు పడింది. అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ అవ్వాలని ఆదేశించింది. ఆయనకు ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని విపక్షాల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. . ఇటీవల అనంతంపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను ఈసీ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో అమిత్‌ బర్దర్‌ను నియమించింది.