ఆషాఢ మాసంలో అంబానీ ఇంట్లో పెళ్లి.. ఏ ముహూర్తం.. ఏంటా ఆచారం..?

ఆషాఢ మాసంలో అంబానీ ఇంట్లో పెళ్లి.. ఏ ముహూర్తం.. ఏంటా ఆచారం..?

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అంబానీ ఇంట్లో పెళ్లి గురించే చర్చే.. కాకపోతే మన తెలుగోళ్లకు మాత్రం ఓ పెద్ద డౌట్ వచ్చింది. ఇది ఆషాఢమాసం కదా.. మూఢం కూడా ఉంది.. అలాంటి మూఢంలో అంబానీ పెళ్లి ఎలా చేస్తున్నాడు అని.. ఇలాంటి మూఢంలో అంబానీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగటం వెనక శాస్త్రం ఏం చెబుతోంది.. ఏ శాస్త్రం ప్రకారం అంబానీ.. మన మూఢంలో పెళ్లి చేస్తున్నారు అనేది చూద్దాం.. మన అషాఢంలో అంబానీ ఇంట్లో పెళ్లి శాస్త్రం ప్రకారం సమ్మతమేనా.. అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. . . 

అంబానీ ఇంట్లో పెళ్లి ముహూర్తాన్ని దృక్​గణితం ఆధారంగా రూపొందించిన.. సూర్యమాన పంచాంగం ప్రకారం పండితులు ముహూర్తం నిర్ణయించారు. సూర్యమానం పంచాంగాన్ని సూర్యుడు కదలికల ఆధారంగా నిర్ణయిస్తారు.  అందుకే ఉత్తరాది వారు అమావాస్య తిథికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. దక్షిణాది వారు చంద్రుడి కదలికల ఆధారంగా పంచాగాన్ని రూపొందిస్తారు.  అందుకే ఒక ప్రాంతం ఆచారాలకు మరో ప్రాంతం ఆచారాలకు చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు అంబానీ ఇంట పెళ్లి ముహూర్తానికి.. ఉత్తరాది వారు ఆచరించే సూర్యమాన పంచాంగమే ఆధారం.

ఇక సూర్యమాన పంచాంగంలో అధికమాసం ప్రస్థావన ఉండదు. అందుకే తిథులు.. ముహూర్తా ల విషయంలో చాలా తేడాలుంటాయి.  ఎవరి ప్రాంతంలో.. ఏ పంచాంగంఆచరిస్తారో.. ఆ పంచాంగం ప్రకారమే ముహూర్తాలు నిర్ణయిస్తారు.  అంబానీ ఇంట్లో  జరిగే పెళ్లి ముహూర్తానికి సూర్యమానం పంచాంగం ప్రకారం  వధూవరులకు.. పరమ మిత్ర తార కలిగిన శుభ ఘడియలున్నాయి. అంతే కాకుండా ఆ ముహూర్తానికి వివాహ ముహూర్తం కూడా ఉందని ఉత్తరాది పండితులు చెబుతున్నారు. అందుకే అన్నీ ఆలోచించి ముహూర్తాన్ని నిర్ణయించారు.

అనంత్ అంబానీ- ..రాధికా మర్చంట్‌ వివాహం దృక్​ గణితం ప్రకారం రూపొందించిన  సూర్యమానం పంచాగం  జులై 12న జరగనుంది. శుభ్ వివాహ్‌తో పెళ్లి వేడుకలు మొదలై జులై 13వ తేదీన శుభ్ ఆశీర్వాద్, జులై 14వ తేదీన మంగళ్ ఉత్సవ్‌తో ముగియనున్నాయి.  సూర్యమానం ప్రకారం  ఈ రోజున మేషరాశిలో .. చంద్రుడి సంచారం.. ఇంగ్లీష్ తేదీ 12 జూలై 2024 .. సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణిస్తుంటాడు.  . ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ ముహూర్తంలో వివాహానికి అత్యంత శుభప్రదమని సూర్యమానం పంచాంగం ద్వారా తెలుస్తోంది. 

 చాంద్రమానం పంచాంగం ప్రకారం .. కన్య రాశిలో చంద్రుడి సంచారం.. ఆషాఢ మాసం, శుక్ల పక్షం, ఇంగ్లీష్ తేదీ 12 జూలై 2024 సూర్యుడు దక్షిణయానం, రాహుకాలం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. షష్ఠి తిథి మధ్యాహ్నం 12:33 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత సప్తమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు ఉత్తర ఫాల్గుణి నక్షత్రం సాయంత్రం 4:09 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత హస్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి కన్యా రాశిలో సంచారం చేయనున్నాడు.

ప్రపంచమంతా ఒకే ఆచారాలు. ఒకే పద్దతులు ఉండవు.  అలానే సమయం కూడా ఒకచోట ఒకరకంగా ఉంటే.. మరో చోట మరో సమయం ఉంటుంది.  ఇక భారతదేశానికి వస్తే.. ఉత్తర భారతదేశం సంప్రదాయాలకు... దక్షిణ భారతదేశం సంప్రదాయాలకు చాలా తేడా ఉంటుంది.  ఏదైనా పూజలు .. కాని.. శుభకార్యాలు జరిగేటప్పుడు  దక్షిణ భారతదేశంలో పండితులు సంకల్పం చదివేటప్పుడు స్వస్తి శ్రీ చాంద్రమానేన... అంటూ.. తిథి.. వార.. నక్షత్రం చదువుతారు.  అలానే ఉత్తర భారతదేశంలో  స్వస్తి శ్రీ సూర్యమానేన  అంటూ.. తిథి.. వార.. నక్షత్రం చదువుతారు.

దేశమంతటా ఒకే పంచాంగం లేకపోవడానికి ప్రజలు సూర్యమానం, చాంద్రమానం వేర్వేరుగా ఎవరి ఆచారాలను .. వారు విధిగా పాటిస్తారు.  .. దక్షిణాది రాష్ట్రాల్లో చాంద్రమానం ప్రకారం, ఉత్తరాదిన సూర్యమానం ప్రకారం గణించడం వల్ల వారికి, మనకు కొంత తేడాలు వస్తున్నాయని చెప్పారు.