ఒక్కటైన అనంత్​​ అంబానీ, రాధిక

ఒక్కటైన అనంత్​​ అంబానీ, రాధిక

ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యాపార వేత్త, రిలయన్స్​ ఇండస్ట్రీస్ ​చైర్మన్​ ముకేశ్ ​అంబానీ కుమారుడు అనంత్​, రాధిక పెళ్లి ముంబైలో శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. హంగూఅర్భాటాల నడుమ దేశవిదేశాలకు చెందిన వ్యాపారవాణిజ్య, సినీ, క్రీడారంగాల ప్రముఖుల సమక్షంలో వీళ్లిద్దరు ఏడడుగుల బంధంతో ఏకమయ్యారు.   ముకేశ్ ​అంబానీ రెండో కొడుకు అనంత్​కు, వీరేన్​–శైలా దంపతుల కూతురు రాధికా మర్చంట్​తో గత డిసెంబరు 29న ఎంగేజ్​మెంట్​ జరిగింది.

ప్రీవెడ్డింగ్​కోసం అంబానీ కుటుంబం 134 రోజులపాటు భారీ ఎత్తున సంప్రదాయ వేడుకలు నిర్వహించింది. బిల్​గేట్స్​, జుకర్​బర్గ్​, ఇవాంకా ట్రంప్​, జాన్​సెనా, కిమ్​కర్దాషియాన్​, గౌతమ్​అదానీ, టోనీ బ్లేయిర్, రిహానా, మైక్​టైసన్​, డేవిడ్​బెక్​హామ్, అమితాబ్​ బచ్చన్​​ వంటి ప్రముఖులు హాజరయ్యారు. కొన్ని మీడియా సంస్థల అంచనాల ప్రకారం పెళ్లి వేడుకల కోసం ముకేశ్​ అంబానీ కుటుంబం రూ.వెయ్యి కోట్లకుపైగా ఖర్చు చేసింది.