ఆప్షన్స్‌‌ ట్రేడింగ్ తగ్గించే చర్యలు తీసుకోవడం లేదు

న్యూఢిల్లీ: డెరివేటివ్‌‌(ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌‌) ట్రేడింగ్ వాల్యూమ్స్‌‌ను  మరింతగా తగ్గించే ప్లాన్ సెబీకి లేదని ఈ సంస్థ హోల్‌‌టైమ్‌‌ మెంబర్ అనంత్‌‌ నారాయణ్‌‌ శనివారం పేర్కొన్నారు.  ఎవరు డెరివేటివ్‌‌ మార్కెట్‌‌లో ట్రేడ్ చేయాలో  నిర్ణయించే గైడ్‌‌లైన్స్‌‌ను తీసుకురావడం లేదని  అన్నారు. 

ఫైనాన్షియల్ సిస్టమ్‌‌ను మెరుగుపరిచేందుకు ఆర్‌‌‌‌బీఐ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జీ పద్మనాభన్‌‌ నేతృత్వంలో ఎక్స్‌‌పర్ట్ గ్రూప్  పనిచేస్తోందన్నారు. వ్యాపారం చేసుకోవడాన్ని మరింత సులభంగా మార్చేందుకు, రిస్క్ మేనేజ్‌‌మెంట్‌‌ను  మెరుగుపరిచేందుకు పనిచేస్తోందని వివరించారు.