అనంతనాగ్ లో ఓటెయ్యాలంటే వణుకుడేే

అనంతనాగ్, గతంలో ఎవరికీ పెద్దగా తెలియని లోక్ సభ నియోజకవర్గం. ఎక్కడో జమ్మూకాశ్మీర్ లో ఉంటుంది. కాశ్మీర్ లోని ఆరు లోక్ సభ నియోజకవర్గాల్లో ఇదొకటి. ఈసారి లోక్ సభ ఎన్నికలతో అనంతనాగ్ దేశవ్యాప్తంగా పాపులర్ అయింది.ఎంత పెద్ద లోక్ సభ నియోజకవర్గమైనా ఒకేసారి పోలింగ్ జరగడం సహజం. అయితే అనంతనాగ్ సెగ్మెంట్ లో మొత్తం మూడు దశల్లో పోలింగ్ జరుగుతుంది. దేశ ఎన్నికల చరిత్రలోనే ఒక లోక్ సభ నియోజకవర్గానికి మూడు దశల్లో పోలింగ్ నిర్వహించాలనిఈసీ నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి.

శాంతి భద్రతల సమస్య వల్లే..

అనంతనాగ్ సెగ్మెంట్ లో శాంతి భద్రతల సమస్య ఉంది. దీంతో మూడు దశల్లో పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. మొదటిదశ ఈ నెల 23న జరిగిం ది. రెండో దశలో భాగంగా కుల్గాం జిల్లాలో ఈనెల 29న పోలింగ్ జరుగుతుంది.మూడో దశలో భాగంగా పుల్వామా, పోపియాన్ జిల్లాల్లో మే ఆరో తేదీన పోలింగ్ జరుగుతుంది. అనంతనాగ్ మొదటి నుంచీ సమస్యాత్మకమే. 40 మందికి పైగా సీఆర్ పీఎఫ్ జవాన్లను టెర్రరిస్టులు హతమార్చిన దారుణ సంఘటన జరిగిందిఈ సెగ్మెంట్ పరిధిలోని పుల్వామా లోనే.

తొలి దశలో 13.61 శాతమే

తొలి దశలో అనంతనాగ్ జిల్లాలో పోలింగ్ శాతం13.61 గా నమోదైంది.  2014 ఎన్నికల్లో అనంతనాగ్ జిల్లాలో 39.37 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు, టెర్రరిస్టుల బెదిరింపుల కారణంగా పోలింగ్ శాతం బాగా పడిపోయిందని అధికారులు చెప్పారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు పోలింగ్ ప్రారంభమే కాలేదు. తర్వాత కూడా చాలా తక్కువ మంది పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సొంతూరు బిజ్ బిహారాలో కేవలం 2.04 శాతంపోలింగ్ నమోదైంది.

2014లో మెహబూబా ముఫ్తీ గెలుపు

2014 లోక్ సభ ఎన్ని కల్లో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) తరఫున మెహబూబా ముఫ్తీ ఇక్కడ నుంచిగెలిచారు. 2016 ఏప్రిల్ లో ఆమె ముఖ్యమంత్రి కావడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు.2017 ఏప్రిల్ లో ఇక్కడ బై ఎలక్షన్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అయితే ఇక్కడహింసాకాండ చెలరేగి తొమ్మిది మంది చనిపోవడంతో బై ఎలక్షన్ వాయిదా పడింది. అనంతనాగ్ సెగ్మెంట్ లో ఎన్నిక వాయిదా పడటం ఇదే తొలి సారికాదు. 1991 లో కాశ్మీరీ వేర్పాటు వాదులు,కేంద్రానికి మధ్య వివాదం తలెత్తిన నేపథ్యం లో ఘర్షణలు జరిగి పెద్ద సంఖ్యలో జనం చనిపోయారు. దీంతో ఇక్కడ ఎన్నిక వాయిదా పడింది. 1996 ఎన్నికల్లోభాగంగా మళ్లీ పోలింగ్ నిర్వహించారు.

ప్రధాన పార్టీలకు ప్రాతినిధ్యం కల్పించిన సెగ్మెంట్

అనంతనాగ్ నియోజకవర్గం 1967లో ఏర్పాటైంది.రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఇక్కడి నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించాయి. 1967, 1971,1977 ల్లో అనంతనాగ్ నుంచి కాంగ్రెస్ కేండిడేట్లుగెలిచారు. 1980కి వచ్చేసరికి రాజకీయ పరిస్థితిమారిం ది. 1980, 1984 లో నేషనల్ కాన్ఫరెన్స్( ఎన్ సీ) కేం డిడేట్లు విజయం సాధిం చారు. 1996లో జనతాదళ్ కేం డిడేట్ మహమ్మద్ మక్బూల్గెలిచారు. 1998లో కాం గ్రెస్ కు ఇక్కడి ప్రజలు పట్టం కట్టారు. కాం గ్రెస్ తరఫున ముఫ్తీ మహమ్మద్ సయీద్ విజయం సాధిం చారు. 2004 లోపీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ విజయం సాధించిం ది.ఈ ఎన్నికల్లో మెహబూబా ముఫ్తీ గెలిచారు. 2009లో ఎన్ సీ కేండిడేట్ మెహబూబ్ బేగ్ విజయంసాధిం చారు. 2014 లో పీడీపీ నేత మెహబూబాగెలిచారు.

ఆర్టికల్ 370 నేఎన్నికలో కీలకాంశం

ఈసారి బరిలో మొత్తం 18 మంది ఉన్నారు.పీడీపీ తరఫున మెహబూబా ముఫ్తీ , కాం గ్రెస్తరఫున గులాం అహ్మద్ మీర్, నేషనల్ కాన్ఫరెన్స్ టికెట్ పై జస్టిస్ (రిటైర్డ్ ) మసూది, బీజేపీటికెట్ పై సోఫి యూసుఫ్, పీపుల్స్ కాన్ఫరెన్స్తరఫున చౌధురి జాఫర్ అలీ ఉన్నారు. జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక హోదా ఈ ఎన్నికలో కీలకాంశంగా మారింది. ప్రత్యేక హోదా కల్పిం చే ఆర్టికల్ 370ను కాపాడతామంటూ పీడీపీ, నేషనల్కాన్ఫరెన్స్, కాం గ్రెస్ ప్రజల దగ్గరకు వెళుతున్నాయి. అయితే ఆర్టికి ల్ 370 కు వ్యతిరేక వైఖరితీసుకుంటూ బీజేపీ పోటీలో నిలిచింది.