Ananya Nagalla :నన్ను చేసుకునే వాడు అలాంటి క్యారెక్టర్ తో ఉండాలి

మ‌ల్లేషం సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన బ్యూటీ అన‌న్య నాగ‌ళ్ల. ఆ తరువాత ప్లే బ్యాక్ మూవీలో నటించి అనంతరం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఇందులో కీల‌క పాత్రలో నటించి మెప్పించింది. అయితే ఈ అమ్మడికి ఇప్పటి సరైన హిట్ పడలేదు. దీంతో రాబోయే సినిమాలతో ఎలాగైనా హిట్ అందుకోవాలని అనన్య భావిస్తోంది.

తాజాగా తన పెళ్లిపై అనన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనను చేసుకునే వాడు హాయ్ నాన్న సినిమాలో నాని పోషించిన విరాజ్ పాత్ర‌లా ఉండాలని చెప్పుకొచ్చింది. పాజిటివ్ గా అలోచించే వ్యక్తి అయ్యి ఉండాలని వెల్లడించింది. అలాంటి వాడు తార‌స‌ప‌డితే ఏ మాత్రం ఆలోచించకుండా..పెళ్లి చేసుకుంటానని తెలిపింది.

రిలేష‌న్స్ షిప్స్ అంటే ఎప్పుడూ ఓ స్నేహంలా ఉండాల‌ని పేర్కొంది. అప్పుడే ఆ బంధాలు కల‌కాలం నిల‌బ‌డ‌తాయ‌ని అభిప్రాయ‌ప‌డింది. ప్ర‌స్తుతం తంత్ర‌, పొట్టేలు సినిమాల్లో అనన్య నటిస్తోంది. ప్ర‌స్తుతం కెరీర్ పైనే దృష్టి పెట్టిన అన‌న్య.. స్టార్ హీరోయిన్ గా ఎదగాలని ఆశిస్తోంది. దీంతో గ్లామ‌ర్ పాత్ర‌ల‌ను సైతం చేసేందుకు సిద్దపడింది.