టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అనన్య నాగాళ్ల, యువ హీరో యువ చంద్ర కలసి జంటగా నటిస్తున్న చిత్రం పొట్టేల్. ఈ చిత్రానికి నూతన డైరెక్టర్ సాహిత్ మోత్కురి దర్శకత్వం వహిస్తుండగా సింగర్ మరియు నటుడు నోయేల్ సీన్, శ్రీకాంత్ అయ్యంగర్, అజయ్, తనస్వి చౌదరి తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. ఇటీవలే పొట్టేల్ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వస్తోంది.
1980 నాటి నేపథ్యంలో తెలంగాణలోని ఓ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో ముఖ్యంగా జీవితంలో చదువు ఎంత ముఖ్యమనే విషయాల్ని ఎలివేట్ చేశారు. ఇక హీరో యువచంద్ర తన కూతురిని ఎలాగైనా చదివించాలని కష్ట పడుతుంటాడు. ఈ క్రమంలో ప్రేమగా పెంచుకుంటున్న పొట్టేల్ తప్పిపోవడంతో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి.
ALSO READ | ఆరోజు మోహన్ బాబు నో చెప్పి ఉంటే సౌందర్య బ్రతికి ఉండేది: డైరెక్టర్ రాజేంద్ర
అలాగే మూడ నమ్మకాల కారణంగా తన కూతుర్ని బలివ్వడానికి సిద్దమైన ఆ ఊరి పెద్ద నుంచి తన కూతురిని ఎలా కాపాడుకోగలిగాడనేది కథ. టోటల్ గా మంచి గ్రిప్పింగ్ స్టోరీ, ఎలివేషన్స్, విజువల్స్, సౌండ్ ట్రాక్ తో పొట్టేల్ సినిమా ట్రైలర్ ఆడియన్స్ ని బాగానే అలరిస్తోంది. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతోందనే విషయాలు తెలియాలంటే అక్టోబర్ 25 వరకూ ఆగాల్సిందే.
ఈ విషయం ఇలా ఉండగా పొట్టేల్ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ బాగానే కష్టపడుతోంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా నటి అనన్య, హీరో యువచంద్ర మరియు నోయేల్ సీన్ తదితరులు విమానంలో కొంతమేర డిఫరెంట్ గా ప్రచారం చేశారు. ఈ క్రమంలో విమానంలోని ప్రయాణీకులకు పొట్టేల్ చిత్ర పాంప్లేట్లు పంచారు. అలాగే ప్రతీ ఒక్కరూ పొట్టేల్ చిత్రాన్ని థియేటర్ కి వెళ్ళి చూడాలని ప్రయాణికులను కోరారు.