యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల (Ananya Nagalla) జంటగా సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె నిర్మించిన చిత్రం ‘పొట్టేల్’(Pottel). ఈ మూవీ అక్టోబర్ 25న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
పొట్టేల్ ఓటీటీ:
1980 నాటి నేపథ్యంలో తెలంగాణలోని ఓ పల్లెటూరి బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కించారు. ఇందులో ముఖ్యంగా జీవితంలో చదువు ఎంత ముఖ్యమనే విషయాల్ని ఎమోషనల్గా తెరకెక్కించారు డైరెక్టర్ సాకేత్. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ నేడు డిసెంబర్ 20న సడెన్ గా రెండు ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్స్లో ఎలాంటి సమాచారం లేకుండా సడెన్ ఎంట్రీ ఇచ్చింది.
రిలీజ్ కు ముందు భారీ అంచనాలతో వచ్చి కథ, కథనాలతో ఆకట్టుకున్న బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. అయితే, ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తూ వస్తున్నారు. ఇవాళ్టితో నిరీక్షణకు తెరపడింది. ఇక ఆలస్యం ఎందుకు అనన్య నాగళ్ల క్రైమ్ థ్రిల్లర్ చూసేయండి.
కథేంటంటే::
1970, 80వ దశకం నేపథ్యంలో సాగే పీరియాడికల్ కథ ఇది. విధర్భ (మహారాష్ట్ర, తెలంగాణ బార్డర్) ప్రాంతంలోని గుర్రంగట్టు ఊర్లో ఈ కథ జరుగుతుంది. తెలంగాణ ప్రాంతంలో పటేల్ వ్యవస్థ రాజ్యమేలుతున్న రోజులవి. గుర్రం గట్టు అనే ఈ గ్రామంలో.. ఆ ఊరి గ్రామ దేవత బాలమ్మకు ప్రతి పన్నెండేళ్లకు (పుష్కరానికి) ఓసారి జాతర నిర్వహిస్తుంటారు. అక్కడ ఓ పొట్టేల్ ని బలి ఇచ్చి జాతర చేయాలి. ఆ పొట్టేల్ని ఊరి పశువుల కాపరి జాగ్రత్తగా కాపాడుతూ ఉండాలి. అలా వంశపారంపర్యంగా పొట్టేల్ని కాపాడే బాధ్యత నాన్న(ఛత్రపతి శేఖర్) చనిపోవడంతో గంగాధరీ (యువచంద్ర)కి వస్తుంది.
కాగా ఇక్కడ గుర్రంగట్టు గ్రామానికి చిన్న పటేల్ (అజయ్) చెప్పిందే వేదం. ఊరి గ్రామదేవత బాలమ్మ తనకు పూనుతున్నట్లుగా (సిగం వచ్చినట్లుగా)నటిస్తూ అందరిని చెప్పుచేతుల్లో పెట్టుకుంటాడు. వారి వంశపారంపర్యంగా అందరికీ పూనుతు వస్తున్న బాలమ్మ.. చిన్న పటేల్ కు మాత్రం పూనదు. ఆ విషయం ఊరి పొట్టేల్‌ను కాపాడే గంగాధరీకి మాత్రమే తెలుస్తుంది. అదే విషయాన్ని జనాలకు చెప్పినా నమ్మరు. ఆ పటేల్ ఏమో ఊర్లోని బలహీన వర్గాలను ఎదగనివ్వడు. చదువుకోనివ్వడు.
ఈక్రమంలో చిన్న పటేల్ చేసే అక్రమాలను ఎదురించే గంగాధరీ జీవితంలోకి బుజ్జమ్మ (అనన్య నాగళ్ల) వస్తుంది. పెద్దలను ఎదురించి ఆమెను పెళ్లిచేసుకుంటాడు గంగాధరి. అయితే తన తమ్ముడు చదువు లేకపోవడం వల్లే చనిపోయాడని, తన చదువు కోసం తన తండ్రి చనిపోయాడని, చదువు చాలా ముఖ్యమని గంగధారి తన కూతురు సరస్వతి (తనస్వి)ని ఎలాగైనా చదివించాలని పట్టుపడతాడు.
ALSO READ : Today Releases Movies: నేడు (Dec 20న) థియేటర్లలోకి 4 సినిమాలు.. తెలుగు ప్రేక్షకులకి పండగే
ఈ నేపథ్యంలో ఆ ఊరి టీచర్ దుర్యోధన్ (శ్రీకాంత్ అయ్యంగార్)కి ఏం కావాలంటే అది తెచ్చి ఇచ్చి కూతురుకి సీక్రెట్గా చదువు చెప్పిస్తూ ఉంటాడు. ఇంతలోనే గంగాధరీ సంరక్షణలోని పొట్టేల్ మాయం అవుతుంది. జాతర దగ్గర పడుతుందనగా పొట్టేలు ఎలా మాయం అయింది? దాంతో జాతర టైంకి పొట్టేల్‌ను తీసుకు రావాలని ఊరి నుంచి గంగాధరీని వెలివేయడం.. పొట్టేల్‌తో తిరిగి రాకపోతే తన కూతుర్ని బలి ఇస్తానని పటేల్ ఎందుకు అనాల్సి వస్తోంది?
చివరికి గంగాదరీ పొట్టేల్ని కనిపెట్టాడా? ఆ ప్రాసెస్ లో పెద్ద గంగాదరీకి ఎదురైన కష్టాలు ఏంటి? మరి సరస్వతి చదువుకుందా లేదా? ఇంతకీ పొట్టేల్‌ని మాయం చేసిందెవరు? బుజ్జమ్మ చిన్న పటేల్ పై కోపం పెంచుకోవడానికి కారణాలేంటి? అనే తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.