
Ananya Nagalla: తెలుగులో యంగ్ హీరో, కమెడియన్ మిస్టర్ మల్లేశం సినిమాలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ.. వచ్చీరాగానే మంచి క్లాసికల్ హిట్ అందుకున్న ఈ అమ్మడు కెరీర్ ఆరంభంలో అడపాదడపా ఆఫర్లు దక్కించుకుంటూ బాగానే రాణించింది.. కానీ స్టోరీ సెలెక్షన్ సరిగ్గా లేకపోవడం, సినిమాల్లో తన పాత్రలకి ఇంపార్టెన్స్ వంటివి పెద్దగా పట్టించుకోకపోవడంతో వరుస ప్లాప్స్ అందుకుంది.. దీంతో అప్పటి నుంచి ఆఫర్లు దక్కించుకోవడానికి బాగానే కష్ట పడుతోంది.
ఈ మధ్య అనన్య సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.. ఈ క్రమంలో ఫోటో షూట్లు, వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి కునుకు లేకుండా చేస్తోంది. అయితే హొలీ సందర్భంగా నటి అనన్య ఓ ఫోటో షూట్ కార్యక్రమంలో పాల్గొంది. ఇందులో భాగంగా పసుపు రంగు చీరలో ఫొటోలకి ఫోజులిచ్చింది. అంతేకాదు కిలీవేజ్ షోతో రెచ్చిపోయింది. ఈ ఫోటోలు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ లో షేర్ చెయ్యడంతోపాటూ హొలీ విషెష్ చెప్పడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా అవాక్కయ్యారు..
Also Read:-హీరోయిన్ స్నేహ కి అలాంటి ప్రాబ్లమ్ ఉందంట.. అందుకే అన్నింటిని అలా చేస్తూ..
ఎప్పుడూ గ్లామర్ షోకి లిమిటెడ్ ప్రిఫరెన్స్ ఇచ్చే ఈ బ్యూటీ ఉన్నట్లుండి ఒక్కసారిగా క్లివేజ్ షోలో కనిపించేసరికి షాక్ అయ్యారు. దీంతో ఈ ఫొటోలపై నెటిజన్లు స్పందిస్తూ ఆఫర్ల కోసం అనన్య గ్లామర్ షో మొదలెట్టిందంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే మరికొందరు మాత్రం అనన్య గ్లామర్ డాల్ కాదని హోమ్లీ పాత్రలకైతేనే చక్కగా సూటవుతుందని కాబట్టి ఈ గ్లామర్ షో పెద్దగా వర్కౌట్ అవ్వదని కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా నటి అనన్య నాగళ్ళ గతఏడాది తెలుగులో వచ్చిన పొట్టేలు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇందులో చక్కటి పల్లెటూరి యువతి పాత్రలో కనిపించింది. ఈ సినిమాకి థియేటర్స్ లో పెద్దగా రెస్పాన్స్ రాలేదు కానీ ఓటీటీలో బాగానే వర్కౌట్ అయ్యింది. ఇక ప్రముఖ నటుడు వెన్నెల కిషోర్ నటించిన "శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్" అనే సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా కూడా గత ఏడాది రిలీజ్ కాగా ఫర్వాలేదనిపించింది. అయితే నటి అనన్య ఇప్పటివరకూ సమంత, పవన్ కళ్యాణ్, నితిన్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ సరైన బ్రేక్ రాకపోవడంతో పెద్దగా క్లిక్ కాలేకపోయింది.