
Ananya Nagalla: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినీ సెలెబ్రటీలకి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. అయితే ఇందులో కొందరు అవగాహన లేక బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తే.. మరికొందరు పక్కనవాళ్లు చేస్తున్నారు కదా మనం కూడా చేద్దామని చేశారు. ఇప్పుడు పోలీసులు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసేవాళ్ళని టార్గెట్ చెయ్యడంతో భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.. అయితే టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ళపై కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి విచారణకి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు..
దీంతో అనన్య సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినందుకు క్షమాపణలు తెలిపింది. బెట్టింగ్ యాప్స్ గురించి తెలియక ఆలా ప్రమోట్ చేశానని ఇకపై ఇలా జరగదని తెలిపింది. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో రైలుపై 1XBAT బీటింగ్ యాప్ కనిపిస్తున్న ఫోటోని షేర్ చేసింది. అలాగే "ఒక గవర్నమెంట్ ప్రాపర్టీ ఇలాంటి యాప్‌లను ప్రచారం చేస్తుందో లేదో తెలుసుకోవాలనుకున్నాను..
ALSO READ | బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ట్విస్ట్..హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ శ్యామల
అలాగే వాటిని ప్రచారం చేయడం ఇల్లీగల్ మనకు ఎలా తెలుసు?" అంటూ క్యాప్షన్ షేర్ చేసింది. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ ప్రమాదకరమైన బెట్టిఇంగ్ యాప్స్ ని తరచూ లక్షల జన సంచారం కలిగిన మెట్రోరైల్లో ఎలా ప్రమోట్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ విషయంపై మెట్రో అధికారులు కచ్చితంగా వివరణ ఇవ్వాలని కోరుతున్నారు..
ఈ విషయం ఇలా ఉండగా నటి అనన్య నాగళ్ళ గత ఏడాది పొట్టెల్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తదితర సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది. ఈ సినిమాలు థియేటర్స్ లో పెద్దగా వర్కౌట్ కాలేదు కానీ ఓటీటీలో మాత్రం బాగానే వర్కౌట్ అయ్యాయి.