కొత్త ప్రయత్నం చేస్తే తెలుగు ఆడియెన్స్ సపోర్ట్ చేస్తారని మరోసారి రుజువు చేశారంది అనన్య నాగళ్ల. వెన్నెల కిషోర్, రవితేజ మహాదాస్యంతో పాటు ఆమె లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. రైటర్ మోహన్ రూపొందించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంటోందని చెప్పారు మేకర్స్. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అనన్య నాగళ్ల మాట్లాడుతూ ‘ఈ సినిమాతో పాటు నా పాత్రకు కూడా మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు ఒకెత్తు.. ఇందులో చేసిన రోల్ మరో ఎత్తు అని అందరూ అనడం హ్యాపీ. మంచి థ్రిల్ ఇచ్చే ఫిల్మ్ ఇది. చూసిన ప్రతి ఒక్కరూ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అంటున్నారు’ అని చెప్పింది.
సినిమా సక్సెస్ పట్ల హ్యాపీగా ఉందని రవితేజ మహాదాస్యం, డైరెక్టర్ మోహన్ అన్నారు. మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించడం సంతోషంగా ఉందని నిర్మాత వెన్నపూస రమణారెడ్డి చెప్పారు. సినిమా రిలీజ్ చేసిన నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ ‘ఒక మంచి సినిమా తీశారు, మంచి ప్రయత్నం చేశారు అని ప్రేక్షకులు చెప్పడం చాలా ఆనందం ఇచ్చింది. సినిమా చూసిన ఆడియెన్స్ స్క్రీన్‌ప్లే బాగుందని, చివరి 40 నిమిషాలు కట్టిపడేస్తుందని అంటున్నారు. వీకెండ్‌లో మరింత రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నాం’ అని అన్నారు.