యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో సాహిత్ మోత్ఖూరి తెరకెక్కించిన చిత్రం ‘పొట్టేల్’. నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మించారు. అక్టోబర్ 25న సినిమా విడుదలవుతున్న సందర్భంగా అనన్య నాగళ్ల ఇలా ముచ్చటించింది.
దర్శకుడు సాహిత్ చెప్పిన కథలో చదువు అనే పాయింట్ చాలా నచ్చి ఇందులో నటించా. ఇందులో నా పాత్ర పేరు బుజ్జమ్మ. స్ట్రాంగ్ అండ్ ఇంటరెస్టింగ్ క్యారెక్టర్. ట్రైలర్‌లో నా పాత్రను ఎక్కువ రివీల్ చేయలేదు కానీ సినిమాలో చూసి సర్‌ప్రైజ్ అవుతారు. ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్. కథే ఈ సినిమాకి మెయిన్ హైలైట్. ఓ మంచి సందేశాన్ని, తెలంగాణ సంస్కృతిని, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పర్ఫెక్ట్‌గా బ్లెండ్ చేసిన సినిమా ఇది.
పొట్టేల్‌ది ఇందులో కీలకపాత్ర. అది లేకపోతే ఈ కథే లేదు. తను వెళ్లే దారిలో అడ్డొచ్చిన కొండనైనా ఢీ కొట్టడం పొట్టేల్ నేచర్. ఇందులో హీరో పాత్ర కూడా ఏ సమస్య వచ్చినా ఢీ కొడుతూ ముందుకెళతాడు. అలా రెండు విధాలుగా టైటిల్ జస్టిఫికేషన్ ఉంది. యువ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశారు. తనపెర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది.
అజయ్ గారి పాత్ర ఓ మేజర్ హైలైట్. ఇందులోని ప్రతి పాత్రకి ఇంపార్టెన్స్ ఉంది. ప్రతి ఒక్కరు తమ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూపించారు. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది. దీంతో కొన్ని సీన్స్ చూస్తుంటే ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి కళ్లలో నీళ్లు వస్తాయి. దర్శకుడితో పాటు నిర్మాతలకు కూడా ఫ్యాషన్ ఉంటేనే ఇలాంటి సినిమాలు సాధ్యం అవుతాయి.
ఇక నేను నటించిన ‘శ్రీకాకుళం షెర్లక్ హోమ్స్’ రిలీజ్‌కు రెడీగా ఉంది. సతీష్ వేగేశ్న గారి ‘కథకళి’ షూట్ జరుగుతోంది. అలాగే ‘లేచింది మహిళా లోకం’ అనే మరో మూవీ చేస్తున్నా. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో లవ్ స్టోరీస్, క్యూట్ క్యారెక్టర్స్ పోషించాలి అనుకున్నా. అయితే ‘మల్లేశం’లో నా నటన చూసి మెచ్యూర్డ్ క్యారెక్టర్స్
ఇస్తున్నారు. ఈ విషయంలో హ్యాపీగా ఉన్నా’’.