
లగ్జరీ ఫ్రెంచ్ లేబుల్ చానెల్కు తొలి భారతీయ బ్రాండ్ అంబాసిడర్గా లైగర్ బ్యూటీ అనన్య పాండే ఎంపికయ్యారు. 2025 ఏప్రిల్ 15న ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ తన అధికారిక ప్రకటనలో అనన్య పాండే పేరు అనౌన్స్ చేసింది.
1910 లో గాబ్రియెల్ 'కోకో' ఛానల్ స్థాపించిన ఈ బ్రాండ్ కు 26 ఏళ్ల వయసున్న మహిళా ఎంపిక అవ్వడం ఇదే తొలిసారి. అందులోనూ ఏకైక భారతీయ రాయబారిగా అనన్య పాండేను ఎంచుకోవడం విశేషం. ఇది ప్రపంచ లగ్జరీ మ్యాప్‌లో భారతదేశం యొక్క పెరుగుతున్న స్థాయిని బలోపేతం చేస్తుంది.
అయితే, గతేడాది పారిస్ ఫ్యాషన్ వీక్ లో జరిగిన చానెల్ షోకు అనన్య అటెండ్ అయింది. సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత అదే చానెల్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక అవ్వడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
►ALSO READ | Mythri Movie Makers: ఇళయరాజా రూ.5 కోట్ల డిమాండ్.. నోటీసులపై మైత్రి మూవీ మేకర్స్ స్ట్రాంగ్ కౌంటర్!
లేటెస్ట్గా ఈ ప్రఖ్యాత బ్రాండ్‌కుఎంపిక అవ్వడం పట్ల అనన్య తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. "లగ్జరీ ఫ్రెంచ్ లేబుల్ చానెల్తో నా జర్నీ స్టార్ట్ చేస్తుండటం కోసం ఉత్సాహంగా ఉన్నాను. అలాగే, భారతదేశం నుండి మొట్టమొదటి బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నికవ్వడం గర్వంగా భావిస్తున్నాను. కలలు నిజంగా నిజమవుతాయి" అంటూ తన క్యాప్షన్ తో ఆనందాన్ని వ్యక్త పరిచింది. డిజైనర్ రాహుల్ మిశ్రా 'సూపర్ హీరోస్' కలెక్షన్ కోసం ర్యాంప్ వాక్ చేయడం ద్వారా ఆమె పారిస్ ఫ్యాషన్ వీక్‌లో అరంగేట్రం చేసింది.
విజయ్ దేవరకొండ లైగర్ (Liger)మూవీతో అనన్య పాండే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో గ్లామర్ డోస్ పెంచినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కలేదు. దీంతో అనన్యకు ఇదే తెలుగు చివరి మూవీగా నిలిచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'కేసరి చాప్టర్ 2' ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Beyond grateful and excited for my journey with @CHANEL 🖤The first ever brand ambassador for and from India 🙏🏻🇮🇳 Dreams really do come true 🧿 pic.twitter.com/3HRUY6Wmjt
— Ananya Panday (@ananyapandayy) April 16, 2025