
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday) రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ అమ్మడికి మొదట్లో కెరీర్ పరమైన ఇబ్బందులు తప్పు లేదు. ఈ నేపథ్యంలో తాజాగా సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను అనన్య వెలుగులోకి తెచ్చింది.
మన అవసరాలు, సమస్యల గురించి నిర్మొహమాటంగా, ధైర్యంగా చెప్పాలనేది దీపికా పదుకొణీ నుంచే నేర్చుకున్నా అని చెప్పుకొచ్చింది.ఈ విషయం తనకు 'గెహ్రియాన్' సినిమా సెట్ లోనే అర్థమైందని చెబుతోంది. ఆ సినిమాలో నా సహ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) నటించింది.
ఆమె సెట్లో ప్రతి ఒక్కరికీ అండగా నిలబడేదని తెలిపింది. ప్రతి ఒక్కరినీ ప్రేమగా పలకరించేదని, అందరితోనూ మర్యాదపూర్వకంగా వ్యవ హరించేదని తెలిపింది. ఆమె స్టార్ హోదాలో ఉన్నా కొంచెం కూడా గర్వం కనిపించడంటోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న జీవిత సూత్రం ఆమె నుంచే నేర్చుకున్నానని చెప్పింది.
Also Read :- ఓటీటీలోకి నయనతార, సిద్ధార్థ్ స్పోర్ట్స్ డ్రామా
ఇకపోతే వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్లో అనన్య పాండే ఒకరు. అలా ఎంట్రీ ఇచ్చిన అందరికీ లక్ కలసి రాదనే విధంగా మారింది ఈ అమ్మడి పరిస్థితి. చంకీ పాండే కూతురుగా బీ టౌన్ లోకి ఎంట్రీ ఇచ్చిందీ ఈ భామ.
2019 లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అసన్య..ఇప్పటికీ సరైన హిట్ అందుకోలేదు.టాలీవుడ్ లో లైగర్' మూవీతో భారీ ఆశలతో వచ్చిన ఈ అమ్మడుకి నిరాశే ఎదురైంది.