శుభమన్ గిల్ తో ప్రేమాయణంపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్...

శుభమన్ గిల్ తో ప్రేమాయణంపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్...

సాధారాణంగా సినీ సెలెబ్రెటీల గురించి సోషల్ మీడియాలో అలాగే ఇంటర్నెట్ లో లేనిపోని గాసిప్స్ వినిపించడం సహాజం. ఈ క్రమంలో కొందరు సెలెబ్రెటీలు వీటిని ఏమాత్రం పట్టించుకోరు. కానీ మరికొందరు మాత్రం కచ్చితంగా స్పందించి క్లారిటీ ఇస్తుంటారు. బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే విషయంలో గత కొద్దిరోజులుగా పలు లవ్ ఎఫైర్ గాసిప్స్ వినిపిస్తున్నాయి.

అయితే అనన్య పాండే ప్రముఖ క్రికెటర్ శుభమన్ గిల్ తో ప్రేమలో పడిందని ఈ క్రమంలో త్వరలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇటీవలే అనన్య పాండే ఈ విషయంపై స్పందించింది. 

ALSO READ | Shami vs Pandya: షమి vs పాండ్యా.. పక్కపక్కనే ఉన్నా పలకరింపుల్లేవ్

ఇందులో భాగంగా గతంలో శుభమన్ గిల్ తో కలసి తాను ఓ ప్రముఖ సంస్థ యాడ్ లో నటించానని దాంతో అందరూ తమ మధ్య ఎదో ఉందంటూ ప్రచారం చేస్తున్నారని కానీ తమ మధ్య ప్రేమ, గీమ వంటివి ఏమీ లేవని క్లారిటీ ఇచ్చింది. అలాగే తననిజ జీవితంలో శుభమన్ గిల్ ని కలిసింది కూడా చాలా తక్కువని అలాంటిది అతడితో ప్రేమలో ఎలా పడతానని చెప్పుకొచ్చింది. దీంతో శుభమన్ గిల్ మరియు అనన్య పాండే ల మధ్య వినిపిస్తున్న లవ్ ఎఫైర్ వార్తలకి పులిస్టాఫ్ పడింది.

ఈ విషయం ఇలా ఉండగా నటి అనన్య పాండే  తెలుగులో ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ చిత్రం ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది. కానీ ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో లైగర్ చిత్రం తర్వాత అనన్య పాండే మళ్ళీ తెలుగులో నటించలేదు.