కోలీవుడ్ లో సిల్క్ గా అలరించనున్న అనసూయ

కోలీవుడ్ లో సిల్క్ గా అలరించనున్న అనసూయ

టీవీ యాంకర్‌ గానే కాక నటిగానూ ప్రూవ్ చేసుకుంది అనసూయ. క్షణం, రంగస్థలం లాంటి చిత్రాల్లో తన నటనకి ప్రేక్షకుల నుండి కాంప్లిమెంట్స్‌ దక్కాయి. ఇప్పుడామె మరో అడుగు ముందుకేసి తమిళంలోనూ నటిస్తోంది. ఇటీవల ఆ మూవీ షూటింగ్ నుండి ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటోని సోషల్
మీడియాలో షేర్ చేసింది. ‘మరో మంచి కథ.. న్యూ బిగినింగ్.. కోలీవుడ్.. తమిళ్’ అనే హ్యాష్‌ ట్యాగ్స్‌ ని ఆ ఫొటోకి యాడ్ చేసింది. నిజానికి అంతకు ముందే విజయ్ సేతుపతితో కలిసి దిగిన ఓ ఫొటోని అనసూయ షేర్ చేసింది. కానీ సేతుపతి ఫొటో కంటే బ్లాక్ అండ్ వైట్ ఫొటోనే టాక్ ఆఫ్
ద ఇండస్ట్రీ అయింది.

ఇందుకు కారణం.. ఆ ఫొటో ఒకప్పటి సిల్క్ స్మిత ఫొటోని పోలి ఉంది. దీంతో సిల్క్ స్మిత బయోపిక్‌‌లో అనసూయ నటిస్తోంది అనే టాక్ మొదలైంది. ఫొటో రిఫరెన్స్ సిల్క్ స్మిత అని ప్రత్యేకంగా మెన్షన్ చేసిన అనసూయ, అది బయోపిక్ అవునా కాదా అనే విషయం మాత్రం రివీల్ చేయలేదు. దీంతో ఇది సిల్క్ సినిమానే అని కన్‌‌ఫర్మ్ చేస్తూ వార్తలు పుట్టు కొస్తున్నాయి. ఇది నిజమో కాదోననే సంగతి పక్కన పెడితే.. సిల్క్ పాత్రకి అనసూయ యాప్ట్ అని ఈ ఫొటో ప్రూవ్ చేసింది. గతంలో స్మిత జీవితం ఆధారంగా బాలీవుడ్‌‌లో ‘డర్టీ పిక్చర్’ వచ్చింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. విద్య తన నటనతో అవార్డులూ రివార్డులూ అందుకుంది. అలాంటి పాత్ర చేసే అవకాశం అనసూయకు రావడం నిజమే అయితే.. ఆమె కెరీర్ మరో మలుపు తిరిగిందన్నమాటే!